విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మూలపేట గ్రామంలోని రామాలయంలోకి కొండచిలువ ప్రవేశించి కలకలం సృష్టించింది.
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మూలపేట గ్రామంలోని రామాలయంలోకి కొండచిలువ ప్రవేశించి కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం పూజారి గుడిలోకి వెళ్లగా పది అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో ఆయన గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు దానిని పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. ఆలయం పక్కనే గుట్టలు, వాగుల నుంచే కొండచిలువ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.