కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి, ఉగాది పండుగల నేపథ్యంలో ప్రధానంగా శ్రీశైలం, ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు.
దెబ్బతిన్న రహదారుల్లో ఇబ్బందులు పడకుండా తగిన మరమ్మతులు చేయాలని వివరించారు. కర్నూలు నుంచి కోడుమూరు, కోడుమూరు నుంచి దేవనకొండ రోడ్లు గుంతలుగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు రోడ్ల మరమ్మతు పనులపై దృష్టి సారించాలని వివరించారు. కర్నూలు-శ్రీశైలం, నంద్యాల, శ్రీశైలం రోడ్ల మరమ్మతులు సత్వరం చేపట్టాలని పేర్కొన్నారు.
బొమ్మలసత్రం దగ్గర రోడ్డు అధ్వానంగా ఉందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నంద్యాల రోడ్ల అభివృద్ధికి వివిధ పథకాల కింద రూ.46 కోట్లు మంజూరు అయ్యాయని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. బేతంచెర్ల-డోన్, రామళ్లకోట-బేతంచెర్ల, ఆళ్లగడ్డ-అహోబి లం రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనా పనులు జరగకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ఆదోని డివిజన్‌లో పంచాయతీరాజ్‌కు రోడ్ల అభివృద్ధి పనులు ఆర్‌అండ్‌బీ అధికారులు తీసుకుని చేపట్టాలని సూచించారు. అన్ని పనులను వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి
Published Wed, Jan 22 2014 2:53 AM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
Advertisement