గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
అనంతపురం (గుంతకల్లు) : గోదావరి మహా పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాణీకుల సౌకర్యార్థం గుంతకల్లు డివిజన్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు సీనియర్ డీసీఎం స్వామినాయక్ మంగళవారం తెలిపారు. డివిజన్ పరిధిలోని గుంతకల్లు, తిరుపతి, ధర్మవరం రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ఆయన వివరించారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు :
గుంతకల్లు-నరసాపురం మధ్య..
గుంతకల్లు-నరసాపురం మధ్య ప్రత్యేక రైలు(నెం.07843) గుంతకల్లు నుంచి మధ్యాహ్నం 01.00 గంటకు బయలుదేరి డోన్, నంద్యాల, మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, భీమవరం మీదుగా నరసాపురం స్టేషన్‌కు తెల్లవారుజామున 4.00 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు గుంతకల్లు నుంచి ఈనెల(జూలై) 13, 15, 17, 19, 21, 23, 25 వ తేదీల్లో బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా నరసాపురం నుంచి గుంతకల్లు మధ్య నడిచే ప్రత్యేక రైలు(నెం.07844) నరసాపురం నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.40 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు నరసాపురం నుంచి జూలై 14,16, 18, 20, 22, 24, 26 వ తేదీల్లో నడుస్తుందన్నారు. ఈ రైలుకు 8 స్లీపర్, 2 జనరల్ కోచ్ బోగీలుంటాయన్నారు. ఈ రైలు మార్గమధ్యంలో మద్దికెర, పెండేకల్లు, బేతంచర్ల, బుగ్గానపల్లి, గిద్దలూరు, కంభం, దొనకొండ, కారంచేడు, కైకలూరు, పాలకొల్లు స్టేషన్లలో కూడా ఆగుతుందని ఆయన తెలియజేశారు.
ధర్మవరం-విశాఖపట్నం మధ్య..
ధర్మవరం నుంచి విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు (నెం.07712) నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు ధర్మవరంలో రాత్రి 07.50 గంటలకు బయలుదేరి అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం మీదుగా విశాఖపట్నానికి సాయంత్రం 5.00 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు ధర్మవరం నుంచి ఈనెల 15,19,23, 27వతేదీల్లో నడుస్తుందన్నారు.
పార్వతీపురం-ధర్మవరం మధ్య...
పార్వతీపురం నుంచి ధర్మవరం మధ్య తిరిగే ప్రత్యేక రైలు (నెం.07710) సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, మర్కాపురం, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపురం మీదుగా ధర్మవరానికి ఉదయం 6.20 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జులై 14,18, 22,2 6వతేదీల్లో నడుస్తుందన్నారు.
విశాఖపట్నం-ధర్మవరం మధ్య..
విశాఖపట్నం-ధర్మవరం- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని సీనియర్ డీసీఎం స్వామినాయక్ తెలియజేశారు. ఈ రైలు (నెం.07849) విశాఖపట్నంలో వేకువజామున 02.00 గంటలకు బయలుదేరి విజయవాడ, నరసరావుపేట, మర్కాపురం, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం 9.50 గంటలకు చేరుతుంది. ఈ రైలు ఈనెల 21, 25 వ తేదీల్లో నడుస్తుందన్నారు. ధర్మవరం-విశాఖపట్నం (నం-07850) రైలు ధర్మవరంలో ఉదయం 7.45 గంటలకు బయలుదేరి అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మర్కాపురం, నరసరావుపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం మీదుగా విశాఖపట్నంకు తెల్లవారుజామున 02.40 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు ఈనెల 22, 26వ తేదీల్లో నడుస్తుందన్నారు.