పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు | special trains for godavari pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

Published Mon, Jul 20 2015 8:31 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు - Sakshi

పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

విజయవాడ: గోదావరి పుష్కరాలకు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్-విశాఖపట్నం (077076) రైలు హైదరాబాద్‌లో సోమవారం రాత్రి  11.15 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి-విజయనగరం (07721) రైలు తిరుపతిలో  సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది.

తిరుపతి-విశాఖ (07848) రైలు తిరుపతిలో సోమవారం ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. గుంటూరు-రాజమండ్రి (07852) రైలు సోమవారం  తెల్లవారుజామున 4.10 గంటలకు  గుంటూరులో బయలుదేరుతుంది.

గుంటూరు- రాజమండ్రి (07858) రైలు సోమవారం గుంటూరులో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరుతుంది.   తిరుపతి-రాజమండ్రి (07864) రైలు తిరుపతిలో సోమవారం ఉదయం 7.15 గంటలకు బయలుదేరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement