నిజామాబాద్ కల్చరల్: వచ్చే జూలై నెలలో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా సికింద్రాబాద్ నుంచి బాసర వరకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు హైదరాబాద్ డివిజనల్ రైల్వే యూ జర్స్ కన్సల్టేటీవ్ మెంబర్స్ (డీఆర్‌యూసీసీ) సమావేశంలో డీఆర్‌ఎం అరుణసింగ్ అంగీకరించారని డీఆర్‌యూసీసీ మెంబర్ జి. వెంకట్‌నర్సాగౌడ్ తెలిపా రు. ఈ సమా వే శంలో మన జిల్లాకు రైల్వే స్టేషన్‌ల సమస్యలు, రైళ్ల పొడిగింపు విషయూన్ని డీఆర్‌ఎంతోపాటు, రైల్వే అన్ని విభాగాల అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు.
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే గోదావరి పుష్కరాలకు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసరకు 12 రోజుల పాటు పుణ్యస్నానాలు ఆచరించేం దుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకం రైళ్లను నడపాలని కోరానన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ఎక్స్‌లేటర్‌ను ఏర్పాటు చేయాలని, ప్లాట్‌ఫారాలపై కోచ్ ఇండికేషన్ బోర్డులను మరమ్మతు లు చేయాలని, రిజర్వేషన్ కౌంటర్ వద్ద గల పోయో ట్ మిషన్ చెడిపోయినందున నూతన మిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
రెండవ ప్లాట్‌ఫామ్ వద్ద పూర్తిస్తాయిలో షెడ్‌ను నిర్మించాలని, స్టేషన్ ప్రాంగణమంతా అపరిశుభ్రంగా ఉన్నందున పార్కులుఏర్పాటు చేయాలని, బోధన్ గాంధీపార్క్ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ ఎత్తును పెంచేందుకు అధికారులు అంగీకరించారని వివరించారు. ముంబాయిలోని సీఆర్‌టి స్టేషన్ నుంచి మన్మా డ్ వరకు నడుస్తున్న తపోవన్ ఎక్స్‌ప్రెస్ రైలును నిజామాబాద్ వరకు నడపాలని,మేడ్చల్ నుంచి నిజామాబాద్ మీదుగా ముథ్కేడ్ వరకు డబుల్ రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే మార్గం పనుల పూర్తి కోసం ఎంపీ కల్వకుం ట్ల కవిత కృషితో రూ.141 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్, కర్నూర్,, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నాందేడ్ జిల్లాల నుంచి మొత్తం 18 మంది సభ్యులు పాల్గొన్నారు.
‘గోదావరి’ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
Published Thu, Mar 12 2015 3:02 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement