ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణలో ప్రతిష్టంభన నెలకొంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో నేటి నుంచి భూ సమీకరణ ..
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణలో ప్రతిష్టంభన నెలకొంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో నేటి నుంచి భూ సమీకరణ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రైతుల నుంచి అంగీకార పత్రాల స్వీకరణకు 27 టీమ్‌లను ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేక బృందాలు ఇంకా అన్ని గ్రామాలకు చేరుకోలేదు. ఉత్తర్వులు అందకుండా గ్రామాల్లోకి ఎలా వెళ్లాలని ప్రత్యేక బృందాలు వేచి చూస్తున్నాయి.
ఒకవేళ సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి ఎలాంటి తమకు ఎలాంటి అధికారం లేదని అధికారులు చెబుతున్నారు. సి.సి.ఎల్.ఏ ఆదేశాల కోసం అధికారులు వేచి ఉన్నారు. ఇప్పటికి కేవలం అయిదారు బృందాలు మాత్రమే గ్రామాలకు చేరుకున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే..ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.