బాలాజీచెరువు (కాకినాడ) / రాజమండ్రి రూరల్ :ఎంసెట్ -2015 ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 15 వేల లోపు ర్యాంకు గల విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా జిల్లావ్యాప్తంగా కాకినాడలో జేఎన్‌టీయూకే, ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్, రాజమండ్రిలో బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మహిళా పాలిటెక్నిక్‌లో 158 మంది, ఆంధ్రా పాలిటెక్నిక్‌లో 145 మంది, జేఎన్‌టీయూకేలో 300 మంది, బొమ్మూరు పాలిటెక్నిక్‌లో 450 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ధృవీకరణ పత్రాల్ని అందుకున్నారు.
జిల్లాలో ఎస్‌టీ విద్యార్థులకు ఆంధ్రా పాలిటెక్నిక్‌లో, రాష్ట్రంలో అంగవైకల్యం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలు, సైనిక కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అరుుతే ఈ విషయం తెలియక అనేకమంది అభ్యర్థులు జేఎన్‌టీయూకే కేంద్రానికి వచ్చారు. అక్కడి కో ఆర్డినేటర్ సుబ్బారావు వారికి వివరాలు తెలపడంతో వెనుదిరిగారు. కాగా కౌన్సెలింగ్‌కు అరగంట ముందుకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఎన్‌టీయూకే ప్రిన్సిపాల్ పద్మరాజు, కో ఆర్డినేటర్ సుబ్బారావు అవగాహన కలిగించారు. సందేహాలుంటే కో ఆర్డినేటర్‌ను సంప్రదించాలని, ఎవరికి వారే కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఏటా కళాశాలల వివరాలతో కూడిన బుక్‌లెట్ ఇవ్వడంతో పాటు, వెబ్ ఆప్షన్ల నమోదుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ఈసారి రద్దు చేయడంతో తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లు ఎలా చేయాలన్న దానిపై అయోమయూనికి లోనవుతున్నారు. కాగా కౌన్సెలింగ్ సెంటర్‌ల వద్ద ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల తాకిడి ఎక్కువగా ఉంది. దూరప్రాంతాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న ఆంధ్రా విద్యార్థులు అధిక సంఖ్యలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. బొమ్మూరు కేంద్రంలో మంచినీటి సదుపాయం సరిగా లేక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురయ్యారు. శనివారం 15,001నుంచి 30,000ర్యాంకు వరకు గల విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని బొమ్మూరు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ విలియం క్యారీ తెలిపారు.
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Sat, Jun 13 2015 1:11 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement