జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలకు కాస్తంత ఊరట లభించింది. తొలివిడత కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి దాదాపు 70 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. గత ఏడాది కంటే మెరుగ్గా సీట్ల భర్తీ కావడంతో కళాశాలల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. రెండు కళాశాలల్లో శతశాతం భర్తీకి
చేరువకావడం విశేషం.
ఎచ్చెర్ల : రాష్ట్ర ఉన్నతవిద్యామండలి మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లు అలాట్ మెంట్లను శుక్రవారం ప్రకటించింది. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది ఇంజినీరింగ్ అడ్మిషన్లు మెరగుపడటం విశేషం. కౌన్సెలింగ్ సకాలంలో జరగ టం ఇందుకు దోహదపడిందని యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాలో కన్వీనర్ సీట్లు 2688 ఉండగా 1901 సీట్లు అంటే 70.72శాతం భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్‌కు జిల్లా నుంచి 5103 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 4717 మంది హాజరయ్యారు. ఈ నెల 12 నుంచి 20 వరకు జరిగిన కౌన్సెలింగ్‌లో బాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 3009 మంది హాజరయ్యారు.
ఈ ఏడాది తొలి విడత భర్తీ పరిశీలిస్తే...
---------------------------
కళాశాల కన్వీనర్ సీట్లు -నిండినవి - శాతం
జీఎంఆర్ ఐటి, రాజాం- 588- 585- 99.45
ఐతం, టెక్కలి- 588 585- 99.45
శ్రీవెంకటేశ్వర, ఎచ్చెర్ల- 294- 224- 76.19
శ్రీశివానీ,చిలకపాలేం- 378- 270- 71.42
వైష్ణవి, సింగుపురం- 168 -73- 43.45
సిస్టం, అంపోలు- 252- 80- 31.74
ఎస్‌ఎస్‌ఐటీ, చికలపాలెం -294- 74- 25.17
ప్రజ్ఞ -126- 10- 07.09
--------------------
బ్రాంచ్‌లు వారిగా సీట్లు....
బ్రాంచ్- సీట్లు- నిండినవి
ఈసీఈ- 690- 373
త్రిఫుల్‌ఈ- 483- 280
మెకానికల్- 546- 423
సివిల్- 337- 232
సీఎస్‌ఈ -504- 442
ఐటీ -84- 83
కెమికల్- 42- 42
పవర్ -42- 42
------------
రెండో కౌన్సెలింగ్‌కు కసరత్తు
మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియటంతో రెండో విడత కౌ న్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో అలాట్ మెంట్ పొందిన విద్యార్థులు నెట్ కళాశాల వెబ్ ఆప్షన్ సబ్‌మిట్ చేయవల్సి ఉంటుంది. అనంతరం తరగతులకు జూలై మూడు నుంచి హాజరు కావచ్చు. రెండో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కళాశాలలో చేరనవసరం లేదు. రెండో విగత అలాట్ మెంట్లు తరువాత కళాశాలలో చేరే అవకాశం ఉన్నత విద్యామండలి కల్పించింది.
మెరుగు పడింది
Published Sat, Jun 27 2015 1:52 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement