రాష్ట్ర నాయకులందరూ హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాదాపు అన్ని పార్టీల అగ్రనాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఓసారి చూద్దామా..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన పార్టీ సభ్యులు కలిసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఉదయం 10.30కి నెం.7 రేస్కోర్సు రోడ్డులో కలిశారు. 23 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులో జరిగే అఖిలపక్ష సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొంటారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉదయం 11 గంటలకు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కలిశారు. సాయంత్రం 4.15 గంటలకు ఆయన సుష్మా స్వరాజ్తో భేటీ అవుతారు.
ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత మంత్రులు, నాయకులు ధర్నా చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీడియాతో కూడా మాట్లాడే అవకాశముంది.
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుమేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తినకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన ఏపీ భవన్లో సీమాంధ్ర నాయకులను కలుస్తారు.
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టుకు వెళ్తారు.
రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి వార్ రూం భేటీకి వెళ్తారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రుల బృందం సమావేశమయ్యే అవకాశం ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు.
హస్తినలో ఎవరెక్కడ...
Published Tue, Feb 4 2014 12:24 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement