State leaders
-
మంచి మనసున్న మన్నెం
నల్గొండ: ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న గణేశ్‌కు చికిత్స అనంతర ఖర్చుల కోసం మండలానికి చెందిన ఎన్ఆర్ఐ, బీఆఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెందిన శంకర్ కుమారుడు గణేష్‌కు ఇటీవల నిమ్స్‌లో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న మన్నెం రంజిత్ యాదవ్ ఆదివారం నిమ్స్‌లో గణేష్ తల్లిదండ్రులను కలిసి వారికి రూ.20వేలు అందజేశారు. ఆయన వెంట మాడుగులపల్లి బీఆఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు కడయం సైదులు, ముద్ద నవీన్ ఉన్నారు. -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాదు.. మనది కేడర్ బేస్డ్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘మనది క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాకుండా కేడర్ బేస్డ్ పార్టీ. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే ముఖ్యం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటే ఎలాంటి స వాళ్లు అయినా ఎదుర్కోవచ్చు. అడుగడుగునా టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు ఎండగట్టాలి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించి ఐకమత్యంతో ఒక్కటిగా ముందుకెళ్లాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రశిక్షణ్ శిబిరంలో జాతీయ నేతలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. రెండోరోజు శిక్షణలో భాగంగా సోమవారం ప్రధానంగా సంస్థాగత అంశాలు, పార్టీ చరిత్ర, ఆరెస్సెస్‌తో సంబంధాలు, మోదీ హయాంలో వివిధ రంగాల విజయాలు, విదేశాంగ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం తదితర అంశాలపై తరగతులు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, అనుకూల భావజాల సంస్థలతో పార్టీకున్న సంబంధాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడం, కొత్తగా చేరిన పార్టీ నేతలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేతలు కలిసికట్టుగా పోరాడితే కలిగే ప్రయోజనాలు, రాష్ట్రంలో అధికారం సాధించాలంటే కార్యక్షేత్రంలో పనివిధానంపై జాతీయనేతలు పలు సూచనలు చేశారు. ప్రభారీ బాధ్యతల నుంచి తప్పించండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పోలింగ్ బూత్ కమిటీలను నియమించే బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ(ప్రభారీ)లదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీ వేయాలని, లేనియెడల ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామన్నారు. అసెంబ్లీ ఇన్చార్జీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని పలువురు నేతలు మరోసారి తరుణ్ చుగ్, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌చార్జీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆ బాధ్యతలపట్ల కొందరు విముఖత వ్యకం చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ భేటీ మూడ్రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం తదితర 14 అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. చివరిరోజున ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు. రెండోరోజు దేశనిర్మాణంలో బీజేపీ పాత్ర, మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించారు. బలహీనవర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై చర్చ చేపట్టారు. రెండోరోజు శిక్షణ తరగతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! -
నవశక రాజకీయానికి సీఎం జగన్ శ్రీకారం: సజ్జల
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని.. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చాత్తాద శ్రీ వైష్ణవ కార్పొరేషన్ ఛైర్మన్ టి.మనోజ్‌కుమార్ అధ్యక్షతన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చాత్తాద శ్రీ వైష్ణవ కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకునే అట్టడుగు వర్గాల నేతలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకులు పేరు తెచ్చుకోవాలి గాని అధికారం ఉంది కదా అని జులుం ప్రదర్శించే విధానానికి కాలం చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారని తెలియచేశారు. కొందరి రాజకీయ నేతల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే తత్వం వైఎస్ జగన్‌ది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
పలు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ట్రాలలో పార్డీ బలోపేతానికి కృషి చేస్తున్న బీజేపీ శనివారం పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడిగా సురేంద్రన్ను, సిక్కిం బీజేపీ అధ్యక్షుడిగా దాల్ బహదూర్ చౌహాన్, మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణు దత్ శర్మలను బీజేపీ అధిష్టానం నియమించింది. త్వరలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నూతన బీజేపీ అధ్యక్షులను అదిష్టానం నియమిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. చదవండి: అలాంటి మాటలు వాడకుంటే బావుండేది: షా -
అందరు కాదు కొందరే
⇒ అమిత్‌షా సభకు ఎంపిక చేసిన నేతలకే ఆహ్వానం ⇒ 25న ఏపీలో పర్యటించనున్న అమిత్‌షా ⇒ సభ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యనేతల భేటీ- చర్చ అమరావతి: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనబోయే సభకు పార్టీ ముందుగా ఎంపిక చేసిన నేతలకే ఆహ్వానం పలకాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీ బూత్ స్ధాయి కమిటీ సభ్యులతో భేటీ అయ్యేందుకు అమిత్ షా ఈ నెల 25వ తేదీన విజయవాడకు రానున్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. కేంద్ర పార్టీ పరిశీలకులు సతీష్ జీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె. హరిబాబు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్రరాజు, రాష్ట్ర మంత్రులు పి. మాణిక్యాలరావు, కె. శ్రీనివాస్, పార్టీ నేతలు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 42,165 వరకు పోలింగ్ బూత్‌లుండగా, అందులో దాదాపు 20 వేల పోలింగ్ బూత్‌లలో పార్టీ కమిటీ నిర్మాణం పూర్తయినట్టు ముఖ్య నేతలు చెబుతున్నారు. అమిత్‌షా పర్యటన నాటికి మరో నాలుగైదు వేల బూత్ కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందంటున్నారు. పార్టీ నిర్మాణం పూర్తయిన ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి ముగ్గురేసి నేతల చొప్పున అమిత్ షా సభకు ఆహ్వానం పంపుతారు. ఆహ్వానాలు పంపే వారికి రెండు రోజుల ముందే సమాచారం ఇవ్వడంతో పాటు వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ నగర సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని అమిత్ షా సభ నిర్వహణకు నాయకులు పరిశీలించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద సభ నిర్వహణకు నేతలు మొగ్గు చూపారు. విశాలమైన ఖాళీ ప్రదేశంలో భారీ స్థాయిలో తాత్కాలిక షెడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బూత్ కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడనున్న అమిత్ షా: రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కొంత మంది బూత్ కమిటీ సభ్యులతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. సభనుద్దేశించి జాతీయ అధ్యక్షుడు ప్రసంగించిన అనంతరం కొంత మంది సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. -
గళమెత్తిన వైఎస్సార్ సీపీ నాయకులు
-
మెతుకుసీమలో నేతల దౌడ్
- ఒకే రోజు పోటెత్తిన అగ్ర నాయకులు నర్సాపూర్‌లో సుష్మా.. - సంగారెడ్డిలో ఆజాద్ నారాయణఖేడ్, జహీరాబాద్, - జోగిపేటలో కేసీఆర్ - జహీరాబాద్‌లో చంద్రబాబు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల వేళ మెతుకుసీమకు అగ్రనాయకులు పోటెత్తారు. పోలింగ్‌కు కేవలం మూడే రోజులు మిగిలి ఉండటంతో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు జిల్లాకు వరుస కట్టారు. కుదిరితే హెలికాప్టర్లో.. లేకుంటే రోడ్డు మార్గంలో ‘దౌడ్’ తీస్తున్నారు. శనివారం బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ నర్సాపూర్‌లో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు గులాంనబీ ఆజాద్ సంగారెడ్డి నియోజకవర్గంలో తిరిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జహీరాబాద్‌లో పర్యటించారు. రాజకీయ అనిశ్చితిలో కేసీఆర్: సుష్మాస్వరాజ్ నర్సాపూర్ సభలో సుష్మాస్వరాజ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయడం చూస్తుంటే రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయినట్టు అర్థమవు తుందన్నారు. ‘రాష్ర్టంలో టీఆర్ఎస్ వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు, లేకుంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆయన కలలు నేరవేరవు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావడం ఖాయం. ఆంధ్రకు నీళ్లను ఇవ్వను అని పంచాయితీ పెట్టుకునే బదులు నదీ జలాలను తెలంగాణకు ఏవిధంగా వినియోగించుకోవాలో ఆలోచన చేస్తే మంచిది’ అని ఆమె అన్నారు. గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మినిష్టర్: కేసీఆర్ జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ మాజీ మంత్రి గీతారెడ్డి మీద విరుచుకుపడ్డారు. గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మినిష్టర్ అని, ఆమె సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శించారు. త్వరలోనే జైలుకు వెళ్లబోయే గీతారెడ్డికి ఓటు వేస్తే దండగేనని జహీరాబాద్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. అందోల్‌లో కేసీఆర్ వచ్చే సమయానికి సభా వద్ద జనం పలుచగా ఉండటంతో ఆయన కేవలం నాలుగే నిమిషాలు ప్రసంగించారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్.. బీజేపీతో కలవదని తేల్చి చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. మరోసారి అవకాశం ఇవ్వండి: ఆజాద్ సంగారెడ్డిలో గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. సెక్యులర్ భావాలు కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని జగ్గారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఐఐటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. మరో మారు అవకాశం ఇస్తే మెట్రో రైలు కూడా పట్టుకొస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. -
హస్తినలో ఎవరెక్కడ...
రాష్ట్ర నాయకులందరూ హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాదాపు అన్ని పార్టీల అగ్రనాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఓసారి చూద్దామా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన పార్టీ సభ్యులు కలిసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉదయం 10.30కి నెం.7 రేస్‌కోర్సు రోడ్డులో కలిశారు. 23 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులో జరిగే అఖిలపక్ష సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉదయం 11 గంటలకు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కలిశారు. సాయంత్రం 4.15 గంటలకు ఆయన సుష్మా స్వరాజ్‌తో భేటీ అవుతారు. ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత మంత్రులు, నాయకులు ధర్నా చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీడియాతో కూడా మాట్లాడే అవకాశముంది. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుమేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తినకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన ఏపీ భవన్లో సీమాంధ్ర నాయకులను కలుస్తారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టుకు వెళ్తారు. రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి వార్ రూం భేటీకి వెళ్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రుల బృందం సమావేశమయ్యే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. -
టీడీపీలో జనం గోల
=తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక టార్గెట్ =వీడియో చిత్రీకరిస్తామని హెచ్చరికలు =అవమానిస్తున్నారంటూ తమ్ముళ్ల ఆవేదన సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఈనెల 29వ తేదీన చేపట్టనున్న ఎన్నికల శంఖారావం సభ జిల్లాలోని నేతలకు తలనొప్పిగా మారింది. సభకు తప్పనిసరిగా జనసమీకరణ చేపట్టాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడం, జిల్లా నాయకులను ఆవేదనకు గురి చేస్తోంది. జన సమీకరణ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే ముద్దు కృష్ణమనాయుడు జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ, నాయకులకు టార్గెట్లు ఇస్తున్నారు. రాష్ట్ర, జిల్లా నాయకులు టార్గెట్ తగ్గకుండా జనాన్ని తీసుకు రావాలని, ఆవిధంగా తీసుకు రాని వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా స్థాయి నాయకుడు 500 మందికి తక్కువ కాకుండా తీసుకుని రావాలని, రాష్ట్ర నాయకులు వెయ్యి నుంచి రెండువేల మందిని తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నుంచి, నగర ఇన్చార్జి చదలవాడ కృష్ణమూర్తికి కూడా 30 వేల మందిని సేకరించాలని సూచించినట్లు తెలిసింది. ఎంత మంది జనాలను సమీకరించారనేవిషయంపై వీడియో చిత్రీకరణ ఉంటుందని, తక్కువ మందిని తీసుకుని వస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని జిల్లా నాయకులకు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. బుధవారం తెలుగుదేశం బూత్ లెవెల్ కమిటీ సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో ముద్దుకృష్ణమ నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి పాల్గొని, జన సమీకరణపై సూచనలు ఇచ్చారు. సమీకరణ చేయని వారిపట్ల పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడంతో, తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాలుగా అధికారంలో లేక పోయినా, పార్టీ కోసం డబ్బు ఖర్చు చేస్తూ, కష్టపడి పని చేస్తున్నా, తమపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అవమానిస్తున్నారని నాయకులు బాధపడుతున్నారు. తమపై నమ్మకం లే క వీడియో చిత్రీకరణ చేయడం సబబు కాదని, పార్టీకి చెందిన జిల్లా నాయకుడు ఒకరు తెలిపారు. జన సమీకరణ చేయకపోతే, తమ పదవులు తీసేస్తామని ముద్దుకృష్ణమ నాయుడు హెచ్చరికలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో పార్టీలో ఎలా కొనసాగాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ముద్దుకృష్ణమ నాయుడు 2004లో పార్టీ అధికారం కోల్పోగానే, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు సీటు ఇవ్వక పోవడంతో, మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చారని ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేక పోయినా, పార్టీ కోసం కష్టపడుతున్న తమపై ఆయన పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల శంఖారావం జరుగనున్న మున్సిపల్ హైస్కూలు మైదానంలో 30 వేల మందికి మించి పట్టరు. అయితే లక్ష మంది సభకు రానున్నారని తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు 29వ తేదీన ఉదయం తిరుపతికి చేరుకుని, నేరుగా తిరుమలకు వెళ్లి, సాయంత్రం మూడు గంటలపైన తిరుపతికి వస్తారని, ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని తెలిసింది. -
కమలనాథుల.. కదన వ్యూహం
పరిస్థితులు చూస్తుంటే జిల్లాలో టీడీపీ మొత్తానికే ఖాళీ అయ్యేట్లు కనిపిస్తోంది... ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ బీజేపీతో జతకట్టే అవకాశాలపై జోరుగా ప్రచారం జరుగుతోంది.. మరోవైపు అదే బీజేపీ రాష్ట్ర నాయకత్వం జిల్లా టీడీపీ నేతలకు గాలం వేస్తోంది.. ఒక ఎంపీ స్థానం, ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని వ్యూహరచన చేస్తున్న కమలనాథులు తమ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను జిల్లా నాయకులతో సంబంధం లేకుండానే మొదలు పెట్టారు...!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ సెంటిమెంట్.. మోడీ గాలిని సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ నాయకులు ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా బీజేపీ నాయకులతో ఏమాత్రం సంబంధం లేకుండా, వారికి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండానే పార్టీ రాష్ట్ర నాయకులు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించే అవకాశాలు దాదాపు శూన్యం. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో పనిచేసిన పార్టీల్లో తామూ ఉండడం, తమ నాయకురాలు సుష్మాస్వరాజ్‌తో గత ఏడాది జిల్లాలో భారీ బహిరంగసభను నిర్వహించి విజయవంతం చేసుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ తర్వాత తెలంగాణ క్రెడిట్ తీసుకునే అవకాశం తమకే ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఆరునెలల గడువే మిగిలి ఉండడంతో ఇప్పటి నుంచే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్న కమలనాథులు ఒకప్పటి తమ మిత్రపక్షమైన టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో బీజేపీ తరఫున ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడగల స్థాయిగల నాయకులు ఇద్దరు ముగ్గురుకంటే ఎక్కువ సంఖ్యలో లేరు. దీంతో ఇతర పార్టీల నుంచి ఒకింత పేరు, గుర్తింపు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న వారిని తమ పార్టీలోకి ఆకర్షించే పనిలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో, అదే పార్టీ నేతలను లాగేసే పనిలో బీజేపీ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈసారి ఎన్నికల్లో బీజేపీ భువనగిరి లోక్‌సభ స్థానం, ఆలేరు, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారని, అది కుదరని పక్షంలో భువనగిరి పార్లమెంట్ లేదా నల్లగొండ పార్లమెంట్ స్థానం బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక, బీజేపీకి చెందిన నాయకులు కాసం వెంకటేశ్వర్లు ఆలేరు నుంచి, పార్టీ రాష్ట్ర కోశాధికారి మనోహర్‌రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతకు మించి నాయకులు లేకపోవడంతో బీజేపీ ఇతర పార్టీల వారికి గాలం వేస్తోంది. టీడీపీతో పొత్తు ఖరారయితే ఆరు సీట్లు కోరి కనీసం నాలుగుచోట్ల పోటీ చేయాలన్న ఆలోచన వీరిది. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో వెదిరె రాంరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక, నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని, ఆ పార్టీ మాజీలు, ప్రస్తుతం టీడీపీ నేతలు బోయపల్లి కష్ణారెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌లను సంప్రదించినట్లు సమాచారం. వీరు కాని పక్షంలో ఇదే స్థానంలో మరో టీఆర్ఎస్ నాయకుడి గురించి వాకబు చేసి, ఇప్పటికే సమాచారం చేరవేశారని వినికిడి. కోదాడలో టీడీపీ నేత బొల్లం మలయ్యయాదవ్ను ఈ విషయమై కదిలించినట్లు చెబుతున్నారు. సూర్యాపేట నుంచి టీడీపీకే చెందిన ఓ మాజీ నాయకుడిని, దేవరకొండ నుంచి టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి రవీంద్రనాయక్‌ను పార్టీలోకి ఆహ్వానించి పోటీకి పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి టీడీపీకి గండికొట్టే పనిలో బీజేపీ ఉన్నట్లు వారి ప్రయత్నాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
పార్లమెంటు ఆవరణలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న వారిలో పార్లమెంటు సభ్యులు కాని వారిని గుర్తించి, అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి అరగంట ముందు ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమం గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలనే డిమాండ్‌తో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవటం కోసం ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వ్యూహాత్మకంగా కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంటు సెంట్రల్ హాల్‌ను సందర్శించేందుకు అనుమతిపత్రాలు సంపాదించిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించి గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు డజను మంది రాష్ట్ర మంత్రులు, రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించారు. వారిచుట్టూ పార్లమెంటు సభ్యులు వలయంగా నిలబడటంతో ఎంపీలు కానివారిని గుర్తించి అక్కడి నుంచి పంపించటం భద్రతా సిబ్బందికి సాధ్యపడలేదు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, ఎం.ఎం.పల్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, టి.సుబ్బిరామిరెడ్డి, బొత్స ఝాన్సీ, చింతా మోహన్, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, ఏరాసు ప్రతాపరెడ్డి, పి.బాలరాజు, కాసు వెంకటకృష్ణారెడ్డి, మహీధరరెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, అహ్మదుల్లాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆందోళన విరమించిన నేతలంతా సెంట్రల్ హాల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. పార్టీ అధిష్టానం నియమించిన ఆంటోని కమిటీ నుంచి పిలుపు వచ్చినప్పుడే మరోసారి చర్చలకు రావాలని, ఈ లోగా అధిష్టానం ప్రతినిధులెవరినీ కలుసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడినట్లు తెలియవచ్చింది. ‘పెద్దల’ హెచ్చరికలతో వెనుకడుగు! పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమానికి ముందు కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత నేతలంతా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంట్లో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందే పార్టీ అధిష్టానం పెద్దలు ఒకరిద్దరు సీమాంధ్ర ముఖ్య నేతలకు ఫోన్ చేసి ధర్నా కార్యక్రమాన్ని విరమించుకోవాలని గట్టిగానే చెప్పటంతో వారంతా పునరాలోచనలో పడ్డారు. ఈ దృష్ట్యా పార్లమెంటులో నిరసన కొనసాగించటమా, రాజ్‌ఘాట్ గాంధీ సమాధి వద్ద మౌనదీక్షకు దిగటమా? అన్న దానిపై నేతలు తర్జనభర్జన పడ్డారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రాంత ఎంపీలు, నేతలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగి తమ ప్రజల అభిప్రాయాలను కేంద్రం ముందుంచే ప్రయత్నం చేశారని, అలాగే తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.