
నల్గొండ: ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న గణేశ్‌కు చికిత్స అనంతర ఖర్చుల కోసం మండలానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, బీఆఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెందిన శంకర్ కుమారుడు గణేష్‌కు ఇటీవల నిమ్స్‌లో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది.
విషయం తెలుసుకున్న మన్నెం రంజిత్ యాదవ్ ఆదివారం నిమ్స్‌లో గణేష్ తల్లిదండ్రులను కలిసి వారికి రూ.20వేలు అందజేశారు. ఆయన వెంట మాడుగులపల్లి బీఆఆర్‌ఎస్ మండల పార్టీ అద్యక్షుడు కడయం సైదులు, ముద్ద నవీన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment