రాష్ట్ర విభజన అనివార్యం : జేసీ దివాకర్ రెడ్డి | State separation is inevitable: JC Divakara Reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన అనివార్యం : జేసీ దివాకర్ రెడ్డి

Published Tue, Sep 24 2013 2:40 PM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM

JC Divakara Reddy - Sakshi

JC Divakara Reddy

హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యం అని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి కాంగ్రెస్ శాసనసభ్యుడు  జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి విభజన జరిగిపోయినట్లేనని, దీనిని  ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రమే ఆపగలరన్నారు. సీమాంధ్ర నేతల ప్రయత్నాలు వృధా ప్రయాస అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం అనేది ఒక్క సోనియా చేతిలోనే ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విడగొడితే సీమాంధ్ర కాంగ్రెస్ తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనని జెసి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అధిష్టానం రాయల తెలంగాణ విషయం కూడా ఆలోచించడంలేదని ఆయన బాధపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడే ఆయన తప్పుపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement