జగన్ దీక్షకు సర్వత్రా సంఘీభావం | State wide support to YS Jagan's deeksha | Sakshi
Sakshi News home page

జగన్ దీక్షకు సర్వత్రా సంఘీభావం

Published Tue, Aug 27 2013 6:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

State wide support to YS Jagan's deeksha

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమన్యాయం లేదా సమైక్యాంధ్ర.. అన్న నినాదంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో చేపట్టిన ఆమరణ దీక్షకు జిల్లావ్యాప్తంగా సంఘీభావం వ్యక్తమవుతోంది. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్యులు సైతం స్పందిస్తూ అమరణ, రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో కదం తొక్కుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తోడుగా సోమవారం జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాలు జిల్లాను హోరెత్తించాయి. పలాసలో ఇద్దరు పార్టీ నేతలు ఆమరణ దీక్ష ప్రారంభించగా, జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ శ్రీకాకుళం శివారులోని పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా నేతలు దిగ్బంధించారు. దీంతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ స్తం భించింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో రాస్తారోకోను విరమించారు.
 
 ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉద్యమాన్ని కొనసాగించాలనేదే తమ ఉద్దేశమని నేతలు పేర్కొన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వైవీ సూర్యనారాయణ, వరుదు కల్యాణి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, ఆమదాలవలస సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి వనరుల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో భవిష్యత్‌లో రాష్ట్రం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
 =  పలాసలో జగన్‌కు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఆమరణ నిరాహార దీక్షలు  చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కణితి విశ్వనాథం ఆధ్వర్యంలో కాశీబుగ్గ సంత మైదానంలో పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్‌లు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అలాగే పలాస సమన్వయకర్త వజ్జ బాబూరావు పలాస ఆంజనేయస్వామి దేవాలయంలో మృత్యుంజయ యజ్ఞం చేయించారు. మందసలో జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా మండల కన్వీనర్ కురాగౌడ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
 
 =  నరసన్నపేటలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ ప్రారంభించారు. నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్‌లు ప్రసంగించారు.
 
 = ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరులో పార్టీ నాయకురాలు కూన మంగమ్మ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆమెతో పాటు పలవురు నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. 
 
 =  పాతపట్నం నియోకవర్గంలోని కొత్తూరు మండలం మాతల జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ నాయకత్వం వహించారు. 
 
 =  టెక్కలి వైఎస్సార్ కూడలిలో పార్టీ నియోజవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తొలిరోజు దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, మాజీ జెడ్పీటీసీ దువ్వాడ వాణి, వైద్య విద్యార్ధిని దువ్వాడ హైందవి, అత్తా, మామలైన లింగాలవలస సర్పంచ్ సంపతిరావు లక్ష్మి, మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు నిరాహారదీక్ష చేశారు. 
 
 వీరితో పాటు పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ తిర్లంగి జానకిరామయ్య, చింతాడ గణపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేంద్రప్రసాద్, మేడబోయిన రఘురాం తదితరులు దీక్షల్లో పాల్గొన్నారు.
 
 =  ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామంలో వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో రణస్థలం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్, కరిమజ్జి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 =  రాజాంలోవైఎస్‌ఆర్ జంక్షన్ వద్ద పార్టీ సమన్వయకర్త పీఎంజే బాబు ఆధ్యర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సమన్యాయం చేయకుండా ఏకపక్షంగా విభజన చేపట్టడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరో శిబిరంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ చిరుద్యోగులైన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గొప్పదని కొనియాడారు. అనంతరం కంబాల జోగుల ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష శిబిరం ప్రారంభమైంది. రెండు చోట్ల దీక్షలను పాలకొండ సమన్వయకర్త పాలవలస విక్రాంత్ ప్రారంభించారు. 
 
 =  పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త విశ్వసరాయి కళావతి ఆధ్వర్యంలో పాలకొండ మండల, పట్టణ కమిటీలకు చెందిన పది మంది నాయకులు దీక్షలు చేపట్టారు. 
 
 =  ఇచ్ఛాపురం పట్టణంలో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ ఎం.వి కృష్ణారావు, పిరియాసాయిరాజ్‌ల నేతృత్వంలో దీక్షలు చేపట్టారు.  కాయ మోహనరావు, గిలాయ్ ధర్మరాజు, ఆర్ గోపాలరావు, ఎల్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 
 
 నేడు హైవే దిగ్బంధం
 జగన్ దీక్షకు సంఘీభావంగా మంగళవారం దీక్షలు, ఇతర ఆందోళన కార్యక్రమాలతో పాటు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అక్రమ జైలు నిర్బం ధాన్ని అనుభవిస్తున్నప్పటికీ ప్రజల మనోభావాలను జగన్ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. సమన్యాయం పాటించకుండా రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా జైలులోనే ఆమరణ దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. జన పోరాటాల ద్వారా దేనినైనా సాధించవచ్చని జగన్ నిరూపిస్తున్నారన్నారు. సమన్యాయం జరపాలనేది జగన్ డిమాం డని, దానికి అన్ని వర్గాల వారి మద్దతు ఉందన్నారు. ఆయనకు మద్దతుగా మంగళవారం చేపట్టే రాస్తారోకో కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తంలందరూ పాల్గొనాలని, ప్రజలు మద్దతిచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేవారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement