ఉద్యోగుల సమ్మెతో మూతపడిన పోస్టాఫీసులు
గన్నవరం, :
తపాలా ఉద్యోగుల సమ్మె కారణంగా గన్నవరం ప్రాంతంలోని పోస్టాఫీసులు మూతపడ్డాయి. ఏడో వేతన కమిటీని 2014 నుంచి అమలు చేయాలని కోరుతూ తపాలా శాఖలోని మూడు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు షేక్ లాలావజీర్ మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు కె.వెంకటేశ్వరరావు, టి.వెంకటేష్, వి.రాఘవచారి, ఎస్.కె.మోహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
18 నుంచి గ్రామీణ తపాల
ఉద్యోగుల నిరవధిక సమ్మె
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆ సంఘ విజయవాడ డివిజన్ కార్యదర్శి బడుగు గౌరిశంకర్ తెలిపారు. గ్రామీణ తపాల ఉద్యోగులను పార్టు ఉద్యోగులుగా గుర్తించాలని, ఏడో వేతన సంఘం పరిధిలోకి చేర్చాలని, సీనియర్ ఉద్యోగులకు పరీక్షలు లేకుండా పదోన్నతులు కల్పించాలని, మరణించిన ఉద్యోగుల పిల్లలకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 50 శాతం డీఎను మూలవేతనంలో కలపాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈ ఆందోళనకు దిగుతున్నట్లు చెప్పారు. సంఘ నాయకులు రాజులపాటి సత్యనారాయణ, నక్కా కోటేశ్వరరావు, పంగిడిరావు, హరిశ్చంద్రప్రసాద్, ఎం.సాంబశివరావు, సీహెచ్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమ్మెతో మూతపడిన పోస్టాఫీసులు
Published Fri, Feb 14 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement