సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలి
Published Tue, Jan 28 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు మార్గదర్శకాలు రూ పొందించి నిధులు వెంటనే విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి, కొం డమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలని, జీఓ 101ను సవరించాలని సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టం వచ్చి ఏడాది పూర్తయినా దానిలో లోపాలను సవరించి మార్గదర్శకాలు రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం 2013-14 సంవత్సరానికి *13,910 కోట్లు ఖర్చుచేయాల్సి ఉన్నా వేల కోట్లు విడుదల చేసి *3 వేల కోట్లు మాత్రమే వెచ్చించారని విమర్శించారు. దళిత, గిరిజనుల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించడం సిగ్గుచేటని అన్నారు. అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు కొండేటి శ్రీను, కోట గోపి, గాదె నర్సింహ, ఎస్. స్వామి, నాగేశ్వర్‌రావు, జిట్ట నగేష్, దార భిక్షం, ఈసం నగేష్, మల్లయ్య, విజయ్‌కుమార్, వెంకయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement