విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాలను కార్పొరేషన్‌గా మార్పుచేయాలన్న టీడీపీ సర్కారు ఆదేశాల మేరకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు పాలకవర్గం ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఎటువం టి ప్రణాళిక లే కుండానే పాలకవర్గం నెల్లిమర్ల నగర పంచాయతీ, అందులో ఉన్న జరజాపుపేటను విలీ నం చేస్తున్నట్లు ప్రకటించేసింది. అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే తూచ్ అంటూ విలీన ప్రాంతాల్లో జరజాపుపేటకు మినహాయింపు ఇస్తున్నట్లు రహస్యంగా వెల్లడించారు.
మొదటినుంచీ వ్యతిరేకతే..: నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే నగర పంచాయతీ మొత్తాన్ని విలీనం చేయాలని, లేకుండా రెండింటికీ మినహా యింపు ఇవ్వాలంటూ అందరికీ వినతిపత్రాలు అందించాయి. వాస్తవానికి రెండు ప్రాంతాలను మరల మేజర్ పంచాయతీలుగానే కొనసాగించాలంటూ నగర పంచాయతీ హోదాపొందినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తుండగా.. కార్పొరేషన్‌లో కలపడంపై మరింత ఆందోళన వ్యక్తం చేశారు. ఈదశలోనే నగరపంచాయతీలో ఉన్న జరజాపుపేటను మినహాయించడం వారికి మింగుడు పడడం లేదు. దీంతో అధికార పార్టీకి చెందిన నెల్లిమర్ల నాయకులు తమ ప్రాంతాన్ని కార్పొరేషన్ నుంచి తప్పించే విధంగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవిషయంలో స్థానిక ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు గతంలో ఇచ్చిన హమీ మేరకు ప్రయత్నాల్లో భాగస్వాములవుతున్నట్లు సమాచారం. ఈ తతంగాల నేపథ్యంలో విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించడంలో విలీన ప్రాంతాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయంగా తెలుస్తోంది.
మినహాయింపు కష్టమే..: కార్పొరేషన్‌లో విలీనంపై నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాం తా ల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు ప్రభుత్వమే తెరదించాల్సి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇది పద్ధతి ప్రకారమైతే కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు మళ్లీ రెండు ప్రాంతాలను మేజర్ పంచాయతీలుగా మార్పు చేస్తున్న ట్లు డీనోటిఫై చేయాలి. అనంతరం నెల్లిమర్లను కార్పొరేషన్‌లో విలీనం చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పంచాయతీలోని సభ్యులు తీర్మానం చేయాలి. ఈ తర హా వి లీనానికే ప్రభుత్వం సుముఖంగా ఉందని, నెల్లిమర్లకు మినహాయింపు ఇవ్వడం కష్టమేన న్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది పెద్ద ప్రక్రియే అయినప్పటికీ ప్రభుత్వం తలచుకుంటే కొద్ది రోజుల్లోనే ఈతతంగం ముగిసిపోతుందన్న అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా కార్పొరేషన్‌లో విలీనం కావాల్సిన మిగిలిన 15 పంచాయతీల తీర్మానం కోసం సంబంధిత ప్రతిపాదనలు జిల్లా పంచాయతీ అధికారుల వద్ద ఉన్నాయి.
విజయనగరంపై ఉత్కంఠ
Published Mon, Sep 7 2015 12:17 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement