corporation status
-
విజయనగరానికి కార్పొరేషన్ హోదా
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ : విజయ‘నగరానికి’ మహర్దశ కలగనుంది. కార్పొరేషన్ హోదా రావడంతో కేంద్రం నుంచి నిధుల మంజూరు శాతం రెట్టింపుకానుంది. మౌలిక వసతులు కలగనున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్న ఆశలు పట్టణ వాసుల్లో చిగురిస్తున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేరింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం పట్టణంలో 2,44,598 మంది జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం రూ.21 కోట్లు కాగా.. ఖర్చు రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇవే ప్రామాణికాలతో విజయనగరానికి ప్రభుత్వం కార్పొరేషన్ హోదా కల్పించడం పట్టణవాసుల్లో ఆనందం నింపుతోంది. చిగురిస్తున్న ఆశలు... కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన విజయనగరం పరిధిలోని సుమారు 300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఎంత వరకు గాడిన పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. విజయనగరంలో అన్ని ప్రధాన కాలువలతో పాటు చిన్నపాటి కాలువలు సైతం వందేళ్ల కిందట ఏర్పాటు చేసినవే. కాలక్రమంలో వాటిని మరమ్మతులు చేయడం మినహా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయలేదు. గత పాలకవర్గాల హయాంలో ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించినా మోక్షం కలగలేదు. దీనికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలంటే రూ.300 కోట్ల మేర ఖర్చు కావడమేనన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు సైతం నిధులు కేటాయింపునకు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముంపు సమస్యకు మోక్షం కలగలేదు. ముంపు ప్రాంతాలకు విముక్తి..! పట్టణంలోని పెద్దమార్కెట్, పుచ్చలవీధి, మేదరవీధి, కోలగట్లవారివీధి, న్యూపూర్ణా జంక్షన్, పాతబస్టాండ్ డ్రైనేజీల నుంచి వచ్చే మురుగు, వర్షపు నీటితో పెద్దచెరువు నిత్యం నిండుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు కింద సాగుభూమి విస్తీర్ణంతో పాటు చెరువునీటి వినియోగం కూడా తగ్గుతోంది. అధిక వర్షాల కురిసే సమయంలో చెరువునీటి మదుముల తలుపులు తెరుస్తున్నారు. దీంతో పెద్దచెరువుకు దిగువ భాగంలోని సాగుభూమికి ఆనుకొని ఉన్న తోటపాలెం, సిద్ధార్థనగర్, సాయినగర్, భవానీనగర్, గాయత్రీనగర్ ప్రాంతాలు మురుగునీటితో మునిగిపోతాయి. మరోవైపు నిండిన చెరువులోని మురుగునీరు ఉత్తరాన ఊరు పైభా గంలో నిల్వ ఉండి∙న్యూపూర్ణా జంక్షన్ పెద్దమార్కెట్, మున్సిపల్ కార్యాలయం ప్రాంతంముంపునకు కారణమవుతోంది. ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది. తాగు నీటి సరఫరాపై అంచనాలు.. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం నగరంలో ఉన్న జనాభాకు ప్రతిరోజు నీటిని సరఫరా చేయాలంటే 36 ఎంఎల్డీ అవసరం. ప్రస్తుతం మధుపాడ రక్షిత మంచి నీటి పథకం నుంచి 2 ఎంఎల్డీ నీరు, నెల్లిమర్ల, రామతీర్థం రక్షిత మంచి నీటి పథకాల నుంచి మరో 12 ఎంఎల్డి నీరు మాత్రమే సరఫరా అవుతోంది. మరో 22 ఎంఎల్డీ నీరు కొరత కనిపిస్తోంది. వేసవిలో నెల్లిమర్ల మీదుగా ప్రవహించే చంపావతి నది ఎండిపోవటంతో భూగర్భజలాలు తగ్గిపోయి నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది తాటిపూడి జలాశయంలోనీరు అడుగంటి పోవటంతో తాగు నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. రామతీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి దశాబ్దాల కిందట వేసిన పైప్‌లైన్, పథకాలకు మోటార్లు బిగించడం, జనరేటర్, ట్రాన్స్‌ఫార్లర్ల సదుపాయం కల్పించడం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 313 కిలోమీటర్ల పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఏడాది వ్యవధిలో కేవలం 200 కీలోమీటర్ల మేర పూర్తి చేయగలిగారు. ఈ పథకంలో రెండవ ప్యాకేజీ కింద చేపడుతున్న పనుల్లో పూల్‌బాగ్‌కాలనీ శివారుల్లో ఉన్న వ్యాసనారాయణమెట్ట ప్రాంతంలో రూ.96 లక్షల వ్యయంతో 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తియితే ప్రజలకు తాగు నీటి కొరత తీరుతుంది. మరోవైపు 40 వార్డులుగా విస్తరించిన నగరంలో వీధి దీపాల నిర్ణహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. సిబ్బంది పెరిగితే చాలు... విజయనగరం పట్టణంలో పారిశుద్ధ్య సమస్యకు సిబ్బంది కొరతే కారణమన్న వాదన వినిపిస్తోంది. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 275 మంది రెగ్యులర్ సిబ్బంది, 275 ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో పలువురు సిబ్బంది మరణించటంతో రెగ్యులర్ కార్మికుల సంఖ్య 230 తగ్గింది. తాజాగా కార్పొరేషన్ హోదా దక్కించుకోవడంతో సిబ్బంది సంఖ్య పెరిగితే పారిశుధ్యం మెరుగవుతుందన్న ఆశ వ్యక్తమవుతోంది. పార్కులకు కొత్త హంగులు...! కార్పొరేషన్ హోదాతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కులు కొత్త హంగులు సంతరించుకునేందుకు అవకాశం ఉంది. 40 వార్డుల్లో 40 వరకు పార్కులుండగా వాటి నిర్వహణ గత 15 ఏళ్లలో పట్టించుకోలేదు. వాస్తవానికి ఇందులో కొన్ని ఉడా పరిధిలో ఉండగా.. మరికొన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. కార్పొరేషన్ హోదాతో పార్కులను సుందరంగా అలకరించేందుకు ఆస్కారం ఉం టుంది. పక్కనేఉన్న జీవీఎంసీ తరహా పట్టణంలోని ప్రధాన కూడళ్లను పచ్చని నందన వనాల్లా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా పట్టణ రూపరేఖలు మారిపోనున్నాయి. -
నిధులుండీ కక్కుర్తి..!
♦ విజయనగరం పట్టణంలో తీరని దాహార్తి ♦ ఏపీఎండీపీ, అమత్ పథకాల కింద రూ.73 కోట్లు కేటాయించిన కేంద్రం ♦ రెండు పథకాల పూర్తయితే 14 వేలకు పైగా నూతన కుళాయిల ♦ మంజూరుకు అవకాశం ♦ మూడున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న పనులు ప్రాంతం : విజయనగరం హోదా : జిల్లా కేంద్రం, సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు: 40 2011 అధికారిక లెక్కల ప్రకారం జనాభా :2.44 లక్షలు ప్రస్థుతం నివసిస్తున్న జనాభా : సుమారు 4 లక్షలు మంచి నీరు అందించే పథకాలు :3 పట్టణ ప్రజలకు అవసరమైన నీరు:36 ఎంఎల్డీ మూడు పథకాల నుంచి లభ్యమవుతోన్న నీరు :17 ఎంఎల్డీ ప్రస్తుతం ఉన్న కొరత :19 ఎంఎల్డీ ప్రతి రోజు వ్యక్తికి ఇవ్వాల్సిన నీరు :140 ఎల్పీసీడీ ప్రస్తుతం ఇస్తున్న నీరు : 70 ఎల్పీసీడీ వ్యక్తిగత కుళాయిలు :19,880 పబ్లిక్ కుళాయిలు: 458 మీటరు కుళాయిలు :434 చేతిపంపులు : 1080 విజయనగరం మున్సిపాలిటీ: త్వరలో కార్పొరేషన్ హోదా దక్కించుకోనున్న విజయనగరం సెలక్షన్ గేడ్ర్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు మోక్షం లభించడం లేదు. ఇక్కడి ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా ప్రయోజనం లేకపోతుంది. పనుల ప్రగతిపై అధికారులు, మున్సిపల్ పాలకవర్గం దృష్టి్ట సారించకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విజయనగరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీఎండీపీ, అమత్ పథకాల కింద మొత్తంగా రూ.73 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంతో పట్టణ ప్రజలకు నిరంతరాయంగా పూర్తి స్థాయిలో నీటిని అందించాలన్నది ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ఏపీఎండీపీ పథకం పనులు పూర్తయితే పేద ప్రజలకు రూ.200కే 7 వేల నూతన కుళాయిలు, అమత్ పథకం పనులు పూర్తయితే మరో 7,414 కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే రెండు పథకాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనుల్లో ప్రగతి లేకపోవడంతో పట్టణంలో దాహం కేకలు తప్పడం లేదు. మరోవైపు కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయాల్సిన పాలకులు, అధికారులు నివేదికల్లో నూతన కుళాయిలు మంజూరు సంఖ్య చూపించుకునేందుకు కసరత్తు చేయడం విమర్శలకు తావిస్తోంది. దశాబ్దం క్రితం అనధికారికంగా ఏర్పాటైన కుళాయి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేసి వాటిని ఈ పథకాల కింద మంజూరు చేశామని చూపించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. కేవలం కాగితాల్లో లెక్కలు చూపించుకునేందుకు పడుతున్న తాపత్రయం ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించడం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నిధులుండీ కక్కుర్తి బుద్ధి చూపించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నత్తేనయం.. దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్లు మార్పు చేయడంతో పాటు కొత్త ప్రాంతాల్లో పైప్లైన్ల ఏర్పాటు, రక్షిత మంచి నీటి పథకాల వద్ద నూతన మోటార్లు బిగించటం, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ల సౌకర్యం కల్పించడం, కొత్తగా వాటర్ ట్యాంక్‌లు నిర్మించడం తదితర కార్యక్రమాల కోసం 2014లో ప్రభుత్వం ఏపీఎండీపీ పథకంలో రెండు ప్యాకేజీల కింద రూ.48 కోట్ల నిధులు మంజూరు చేసింది. కేటాయించిన నిధులతో ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇందులో ప్యాకేజీ–1 కింద చేపట్టాల్సిన పనులు పూర్తికాగా, ప్యాకేజీ–2లో చేపడుతున్న పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్యాకేజీలో మొత్తం 313 కిలోమీటర్ల పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడేళ్లలో 236 కీ.మీ మేర పూర్తి చేయగలిగారు. పూల్‌బాగ్‌కాలనీ శివారుల్లో ఉన్న వ్యాసనారాయణమెట్ట ప్రాంతంలో రూ.96 లక్షల వ్యయంతో 5 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యంతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పూల్‌బాగ్‌లో నిర్మించతలపెట్టిన మరో రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికీ పునాదుల దశలోనే ఉంది. అమత్ పథకంలో రూ.25 కోట్లు కేటాయింపులు.. విజయనగరం పట్టణ వాసుల దాహార్తిని తీర్చేందుకు అమత్ పథకం కింద 2015–16, 2016–17 సంవత్సరాలకు సంబంధించి రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ని«ధులతో రామతీర్థం, నెల్లిమర్ల రక్షిత మంచి నీటి పథకాల వద్ద తాగు నీటి వనరులు అభివద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రెండు పథకాల నుంచి 6 ఎంఎల్డీ నీరు వస్తుండగా, అమత్ పనులు పూర్తయితే 16 ఎంఎల్డీ నీరు పంపింగ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అనధికారిక కుళాయిలను గుర్తిస్తున్నాం.. గతంలో మున్సిపాలిటీలో చాలా వరకు అనధికారిక కుళాయిలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని గుర్తించే పని మొదలుపెట్టాం. ఏపీఎండీపీ, అమత్ పథకాల కింద రెగ్యులరైజ్ చేస్తాం. ఈ రెండు పథకాల పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. సాంకేతిక ఇబ్బందులు అదిగమించాల్సి ఉంది. – గణపతిరావు, ఇన్చార్జి ఎంఈ, విజయనగరం మున్సిపాలిటీ. -
అధికారమే పరమావధి
ప్రస్తుతానికి విజయనగరం పురమే కార్పొరేషన్ హోదాను అడ్డుకున్న టీడీపీ నేతలు అధికార పార్టీ నేతలకు పదవులు పోతాయన్న భయం నగరపాలక సంస్థ ఉత్తర్వులు తాత్కాలికంగా నిలుపుదల న్యాయపరమైన అభిప్రాయం వచ్చాక తదుపరి చర్యలు భలే చాన్సులే..లక్కీ చాన్సులే..అధికారంలో ఉన్న మజా అనుభవించితే తెలియనులే.. పవర్లో ఉంటేనే హోదా.. డబ్బు..పలుకుబడి లెక్కలేనంత ఉంటాయి. ఒక్కసారిగా అధికారం పోతే దారిన పోయే దానయ్య కూడా ముఖం తిప్పుకుని పక్కనుంచి వెళ్లిపోతాడని అధికార పార్టీ నేతలు గ్రహించినట్లున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఇచ్చిన తీర్మానం ప్రకారం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన విజయనగరం మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గం కూడా తమ హోదా పెరుగుతుందని భావించింది. అయితే పురపాలక సంఘం కార్పొరేషన్‌గా మారాక కొత్తగా పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గ్రహించకుండా.. పాలకవర్గం ఏకపక్ష తీర్మానం చేసి కార్పొరేషన్ హోదా కోసం ప్రభుత్వానికి పంపించేసింది. ఎప్పుడైతే కార్పొరేషన్ ఉత్తర్వులొచ్చి, సాంకేతిక కారణాలు తెలిశాయో పాలకవర్గం కంగుతింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కార్పొరేషన్‌గా మారితే విజయనగరం దశ తిరగనుందని, పెద్ద ఎత్తున అభివృద్ధికి నోచుకుంటుందని పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హోదా వస్తే ముఖ్యంగా కేంద్రప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్లు మంజూరవుతాయి. ఆర్థిక సంఘం నిధులు పెద్ద ఎత్తున వస్తాయి. నగర పాలక సంస్థ కమిషనర్ హోదాలో కౌన్సిల్ ఆమోదం లేకుండా రూ. 10లక్షల వరకు అభివృద్ధి పనుల కోసం నేరుగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. స్టాండింగ్ కమిటీల ద్వారా రూ. 50లక్షల వరకు అభివృద్ధి పనులకు ఖర్చు చేయడానికి వెసులుబాటు ఉంటుంది. నగరపాలక సంస్థలో పోస్టులు కూడా పెరుగుతాయి. అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రతి విభాగానికి సూపరింటెండెంట్ స్థాయి పోస్టులొస్తాయి. త్వరితగతిన నిర్ణయా లు తీసుకుని, ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం వస్తుంది. ఎన్నికల భయంతో యూటర్న్ కార్పొరేషన్ హోదా ఇచ్చాక అందుకు తగ్గ పాలకవర్గాన్ని ఎన్నుకోవాలనే సరికి ప్రస్తుత పాలకులకు భయం పట్టుకుంది. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే గెలవలేమన్న అభద్రతాభావానికి లోనయ్యారు. పదవులు అప్‌గ్రేడ్ అయితేనే కార్పొరేషన్ గా కొనసాగించాలని, లేదంటే మున్సిపాల్టీగానే ఉంచేయాలని పైరవీలు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళి, తదితరులు కొందరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని మరీ ప్రభుత్వంపై ఒత్తిడికి దిగారు. ఆ మంత్రిత్వ శాఖలో పైరవీలు కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సీఎంను సైతం కలిసి తమ పరిస్థితిని ఏకరువు పెట్టారు. కార్పొరేషన్ ఉత్తర్వుల్ని నిలుపుదల పాలకవర్గం ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు ఎన్నికలు నిర్వహిస్తే పరువు పోతుందన్న భయంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత కార్పొరేషన్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.న్యాయపరమైన అభిప్రాయం వచ్చే వరకు హోదాను అబేయన్స్‌లో పెడుతున్నట్టుగా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. మొత్తానికి పట్టణ ప్రగతికి దోహదపడే కార్పొరేషన్ హోదాకు అధికార పార్టీ నేతలే తూట్లు పొడిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అబేయన్స్‌లో కార్పొరేషన్ ఉత్తర్వులు సాంకేతిక కారణాల దృష్ట్యా విజయనగరం పురపాలక సంఘానికి ఇచ్చిన కార్పొరేషన్ హోదాను అబేయన్స్‌లో పెట్టాం. న్యాయప రమైన అభిప్రాయం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతవరకు పురపాలక సంఘంగానే కొనసాగనుంది. - కె.కన్నబాబు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ డెరైక్టర్ -
విజయనగరంపై ఉత్కంఠ
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాలను కార్పొరేషన్‌గా మార్పుచేయాలన్న టీడీపీ సర్కారు ఆదేశాల మేరకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు పాలకవర్గం ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఎటువం టి ప్రణాళిక లే కుండానే పాలకవర్గం నెల్లిమర్ల నగర పంచాయతీ, అందులో ఉన్న జరజాపుపేటను విలీ నం చేస్తున్నట్లు ప్రకటించేసింది. అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే తూచ్ అంటూ విలీన ప్రాంతాల్లో జరజాపుపేటకు మినహాయింపు ఇస్తున్నట్లు రహస్యంగా వెల్లడించారు. మొదటినుంచీ వ్యతిరేకతే..: నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే నగర పంచాయతీ మొత్తాన్ని విలీనం చేయాలని, లేకుండా రెండింటికీ మినహా యింపు ఇవ్వాలంటూ అందరికీ వినతిపత్రాలు అందించాయి. వాస్తవానికి రెండు ప్రాంతాలను మరల మేజర్ పంచాయతీలుగానే కొనసాగించాలంటూ నగర పంచాయతీ హోదాపొందినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తుండగా.. కార్పొరేషన్లో కలపడంపై మరింత ఆందోళన వ్యక్తం చేశారు. ఈదశలోనే నగరపంచాయతీలో ఉన్న జరజాపుపేటను మినహాయించడం వారికి మింగుడు పడడం లేదు. దీంతో అధికార పార్టీకి చెందిన నెల్లిమర్ల నాయకులు తమ ప్రాంతాన్ని కార్పొరేషన్ నుంచి తప్పించే విధంగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవిషయంలో స్థానిక ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు గతంలో ఇచ్చిన హమీ మేరకు ప్రయత్నాల్లో భాగస్వాములవుతున్నట్లు సమాచారం. ఈ తతంగాల నేపథ్యంలో విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించడంలో విలీన ప్రాంతాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయంగా తెలుస్తోంది. మినహాయింపు కష్టమే..: కార్పొరేషన్లో విలీనంపై నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాం తా ల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు ప్రభుత్వమే తెరదించాల్సి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇది పద్ధతి ప్రకారమైతే కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మళ్లీ రెండు ప్రాంతాలను మేజర్ పంచాయతీలుగా మార్పు చేస్తున్న ట్లు డీనోటిఫై చేయాలి. అనంతరం నెల్లిమర్లను కార్పొరేషన్లో విలీనం చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పంచాయతీలోని సభ్యులు తీర్మానం చేయాలి. ఈ తర హా వి లీనానికే ప్రభుత్వం సుముఖంగా ఉందని, నెల్లిమర్లకు మినహాయింపు ఇవ్వడం కష్టమేన న్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది పెద్ద ప్రక్రియే అయినప్పటికీ ప్రభుత్వం తలచుకుంటే కొద్ది రోజుల్లోనే ఈతతంగం ముగిసిపోతుందన్న అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా కార్పొరేషన్లో విలీనం కావాల్సిన మిగిలిన 15 పంచాయతీల తీర్మానం కోసం సంబంధిత ప్రతిపాదనలు జిల్లా పంచాయతీ అధికారుల వద్ద ఉన్నాయి. -
కార్పొరేషన్‌కు... కౌన్సిల్ అంగీకారం
17 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ తీర్మానం కలెక్టర్ నివేదించనున్న మున్సిపల్ పాలకవర్గం విజయనగరం మున్సిపాలిటీ: సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన విజయనగ రానికి కార్పొరేషన్‌గా స్థాయి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మున్సిపల్ కౌన్సిల్ అంగీకారం తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని జిల్లా కేంద్రాలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయనుండడంతో ఈ మేరకు పాలకవర్గం తరఫున ప్రభుత్వానికి పంపించాల్సిన ప్రతిపాదను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. కార్పొరేషన్ హోదాకు అవసరమయ్యే 3 లక్షల జనాభా కోసం 21 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని కౌన్సిల్ అజెండాలో ప్రతిపాదించగా.. 17 గ్రామ పంచాయతీల విలీనానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. విలీన పంచాయతీల్లో నారాయణపురం, కొండకరకాం, ద్వారపూడి, దుప్పాడ, సారిక, గొల్లలపేట, జగన్నాథపురం, సిరియాలపేట, హజీసాహెబ్పేట, మలిచర్ల, బియ్యాలపేట, చెల్లూరు, నెల్లిమర్ల, జరజాపుపేట, చింతవలస, రఘుమండ, పెదతాడివాడ ప్రాంతాలున్నాయి. అజెండాలో పొందిపరిచి, తొలగించిన వాటిలో రామవరం, కరకవలస, జియ్యన్నవలస, గొట్లాం గ్రామాలున్నట్లు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2లక్షల 44వేల 598 జనాభా ఉండగా.. 17 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఆ సంఖ్య 3 లక్షల 7వేల 942కు పెరగనుంది. ప్రస్తుతమున్న 52.46 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం, సుమారు 145 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. వాస్తవానికి 21 గ్రామ పంచాయతీల విలీనంపై ముందునుంచి కౌన్సిల్ సభ్యులు అంతగా ఆసక్తిగా లేరనే చెప్పాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ప్రాంతాలను విలీనం చేయాలని భావించారు. ఈనేపధ్యంలో అధికారులు తయారు చేసిన నివేదికలో ఐదు పంచాయతీలను తొలగిస్తారన్న వాదనలు వ్యక్తం కాగా.. నాలుగు పంచాయతీలతో సరిపెట్టారు. 1888 సంవత్సరంలో మున్సిపాలిటీగా ఏర్పడిన విజయనగరం పట్టణం, 1998 నాటికి సెలక్షన్ గ్రేడ్మున్సిపాలిటీ హోదా దక్కించుకుంది. కార్పొరేషన్ హోదాతో అభివృద్ధికి అవకాశం : మున్సిపల్ చైర్మన్ విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించడం వల్ల అభివృద్ధికి అవకాశం ఉంటుందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. కార్పొరేషన్‌గా స్థాయి పెంపు తన హయాంలో చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందని, అలా కేటాయించిన నిధులతో అన్ని రంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. స్వాగతిస్తున్నాం : ప్రతిపక్ష కౌన్సిలర్ రాజేష్ విజయనగరం మున్సిపాలిటికి కార్పొరేషన్ హోదా కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ప్రతిపక్ష కౌన్సిలర్ ఎస్‌వివి రాజేష్ తెలిపారు. అయితే నిబంధనలకు అనుగుణంగా ప్రతిపానదలు జరగలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియలో అక్కడి ఆర్థిక పరిస్థితులను, అవసరాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ప్రణాళిక బద్ధంగా చర్చ జరిపితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఇంకెన్నాళ్లో..
అనంతపురం టౌన్ : అనంతపురం మునిసిపాలిటీకీ కార్పొరేషన్ హోదా లభించి తొమ్మిదేళ్లు దాటినా, శివారు పంచాయతీల పరిధిలోని కాలనీలను విలీనం చేయాల్సిన ప్రక్రియకు నేటికీ మొక్షం లభించలేదు. ఈ విషయంలో అనంతపురం కార్పొరేషన్‌పై గత ప్రభుత్వమే కాదు ఇప్పటి ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని చిన్నా, పెద్ద మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటైన పురపాలకాలలో పరిసర పంచాయతీలను గత ప్రభుత్వ హయాంలోనే విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు. అనంత కార్పొరేషన్లో మాత్రం ఆ పని చేపట్టలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, పాలకవర్గం కానీ పంచాయతీల విలీనం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించం లేదు. పంచాయతీలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్‌కు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సర్ చార్జీ రూపంలో ఏటా రూ.5 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతుంది. నగర శివారులోని పంచాయతీలకు చెందిన పలు కాలనీలు ఇప్పటికే నగర పాలక సంస్థ స్థాయిలో సౌకర్యాలు పొందుతున్నాయి. పంచాయతీలు విలీనం చేయడం ద్వారా అవన్నీ పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఆధినంలోకి వస్తాయి. తద్వారా సంస్థకు ఆస్తిపన్ను రూపంలో అదనపు ఆదాయం చేరుతుంది. ఆ నిధులతో విలీన కాలనీలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది. ప్రధానంగా తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చు. నీటి యుద్ధాలు తప్పుతాయి నగరంలోకి పంచాయతీలను విలీనం చేస్తే తాగు నీటి సమస్యలు ఓ కొలిక్కి వస్తారుు. అనంతపురం నగరానికి పీఏబీఆర్ ప్రాజెక్టు ద్వారా నీరు సంపూర్ణ స్థాయిలో అందుతోంది. చుట్టుపక్కల ఉన్న నారాయణపురం, రుద్రంపేట, కక్కలపల్లి, కక్కలపల్లి కాలనీ, రాజీవ్ కాలనీ, అనంతపురం రూరల్ పంచాయతీల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ నీటిని అనధికారికంగా మళ్లించుకునేందుకు నారాయణపురం గ్రామస్తులు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున్న గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం అద్దం పగలడంతో పాటు మహిళ హోంగార్డ్‌కు గాయాలయ్యాయి. దాదాపు పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పంచాయతీలను విలీనం చేస్తే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఏటా రూ.5 కోట్లు ఆదాయం కార్పొరేషన్ పరిధిలో భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2 శాతం సర్చార్జిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నగర పాలక సంస్థ తరఫున ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తుంది. ఏటా కోటి రూపాయల వరకు ప్రభుత్వానికి ఇలా జమవుతోంది. ప్రస్తుతం పంచాయతీల పరిధిలోనే అధికంగా భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఆయా పంచాయతీల పరిధిలో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2 శాతం సర్‌చార్జి రూపంలో ఏటా రూ.5 కోట్లకు పైగానే సంస్థ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. విలీనమయ్యే పంచాయితిలు ఇవే... నగర పాలక సంస్థలోకి బుక్కరాయసముద్రం, రాప్తాడు, కక్కలపల్లి, పాపంపేట, నారాయణపురం, అనంతపురం రూరల్ (ఉత్తర, దక్షిణ పంచాయతీల పరిధిలోని కొంత భాగం విలీనం చేసేలా అధికారులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు.) రాజీవ్ పంచాయతీ కేంద్రీయ ఉద్యానవం, తడకలేరు, మహదేవనగర్, రాజీవ్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, పొట్టిశ్రీరాములు కాలనీ, ముత్యాలమ్మకాలనీ, రిక్షాకాలనీ, ప్రియాంక నగర్, గుత్తిరోడ్డులోని పరిశ్రమలు. అనంతపురం రూరల్ పంచాయతీ లెనిన్‌నగర్, ఎన్టీఆర్ నగర్, రామకృష్ణనగర్, ఎల్ఐసీ కాలనీ, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని ప్రొఫెసర్ కాలనీ, భైరవనగర్, సంఘమిత్ర నగర్ ఎక్స్టెన్షన్, అయ్యప్ప స్వామి గుడి, బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మెటల్ క్రషర్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, దాని సమీపంలోని మెడికల్ కళాశాలలు. నారాయణపురం పంచాయతి ఎ.నారాయణపురం, సుఖదేవనగర్, అల్లూరి సీతారామరాజు నగర్, రాయల్‌నగర్, స్టాలిన్ నగర్, తపోవనం, సోమనాథ్‌నగర్ ఎక్స్టెన్షన్, బళ్లారి రోడ్డులోని ఎపి లై టింగ్ వరకు. పాంపపేట, విద్యారణ్యనగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బసవతారక నగర్, జొన్నావీరయ్య కాలనీ, కంబైండ్ ఆటో సర్వీస్. కక్కలపల్లి కాలనీ పంచాయతి నారాయణరెడ్డికాలనీ, సీపీఐ కొట్టాలు, సియాన్నగర్, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ. కక్కలపల్లి పంచాయతి సంగమేశ్వర పిక్నిక్ సెంటర్, సహార టౌన్‌షిప్‌లోని కొంత భాగం, బైపాస్‌రోడ్డు. రుద్రంపేట పంచాయతి రుద్రంపేట గ్రామం, శ్రీనగర్‌కాలనీ ఎక్స్టెన్షన్. రాప్తాడు పంచాయతి : సహార టౌన్షిప్లో కొంత భాగం, బైపాస్‌రోడ్డు, ప్రభాకర్ చౌదరి కాలనీ, ఈనాడు ఎడిషన్ కార్యాలయం, వాటర్ వర్క్స్, ఆర్డీటీ స్టేడియం, బెంగుళూరు బైపాస్ రోడ్డు, ఆర్డీటీ బ్రెయిలీ రెసిడెన్సియల్ పాఠశాల, సెయింట్ విన్సెంట్ డీ పాల్ పాఠశాల. ఉప్పరపల్లి పంచాయతి ఆర్డీటీ స్టేడియం, రైస్‌మిల్, ఆటవీ శాఖకు చెందిన నర్సరీ. బుక్కరాయసముద్రం పంచాయతి సమ్మర్ స్టోరేజి ట్యాంక్, విరూపాక్షనగర్, గుత్తిరోడ్డులో తడకలేరు వరకు. ప్రసన్నాయపల్లిగ్రామం, ఎల్‌ఆర్‌జీ స్కూల్, చిన్మయనగర్, కళాకారుల కాలనీ, పోస్టల్ కాలనీ.