కొత్తనోట్లు వేస్తేనే మొక్కు తీరుతుంది
శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర
సాక్షి, తిరుమల: దేవునికి భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకల్లో పాతనోట్లు వేయవద్దని, కొత్త నోట్లు వేయడం వల్లే మొక్కు తీరుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
భక్తులు ఏడుకొండలవాడిపై అపారమైన భక్తి విశ్వాసాలతో పైసాపైసా కూడబెట్టుకుని ‘‘గోవిందా..గోవిందా’’ అంటూ తిరుమలకు వచ్చి హుండీలో సమర్పిస్తుంటారని, భక్తుల కష్టార్జితంతో కూడిన హుండీ కానుకలు చెల్లవని చెప్పటం సరికాదన్నారు. కేంద్రంతో స్నేహ సంబంధా లున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ఇప్పటికే టీటీడీ వద్ద ఉన్న రూ. 8.29 కోట్ల పాత కరెన్సీ నోట్లను చెల్లుబాటయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.