
అధికారులతో సమీక్షిస్తున్న డీఎంహెచ్‌వో చెంచయ్య
శ్రీకాకుళం అర్బన్: స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.చెంచయ్య చెప్పారు. వ్యాధి ప్రబలకుండా ఉం డేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం వైద్యాధికారులు, డె మో అధికారులు, ఎపిడిమిక్ సిబ్బం దితో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో ఎనిమిది స్వైన్‌ఫ్లూ వ్యాధి కేసులు నమోదయ్యావన్నారు. వీటిలో నాలుగు శ్రీకాకుళం అర్బన్ ప్రాంతంలో, మిగిలిన నాలుగు రూర ల్ ప్రాంతాల్లో గుర్తించామన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వారికి విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లోనే వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. జిల్లాలోస్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడే వారికి వైద్యసేవలు అందించేందుకు రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, మార్కెట్ కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు అతికించి, కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీల్లోనూ, సామాజిక ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ వ్యాధిపై ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, ఫీల్డ్ వర్కర్లకు అవగాహన కల్పించామని, వారు గ్రామీణస్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆడియో విజువల్స్‌ను ప్రతి గంటకు ఒకసారి ఆయా ముఖ్య కూడళ్ల వద్ద వినిపించడం జరుగుతోందన్నారు. సమీక్షా సమావేశంలో డాక్టర్ గిరిధర్, డీఎం వీర్రాజు, డెమో మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment