కలెక్టర్ స్మితాసబర్వాల్
జిన్నారంలోని జెడ్పీహెచ్ స్కూల్, గురుకుల పాఠశాలల సందర్శన
జె డ్పీహెచ్‌ఎస్‌లో పదోతరగతిలో ఉత్తీర్ణతాశాతం తగ్గుదలపై కలెక్టర్ ఆగ్రహం
జిన్నారం, న్యూస్‌లైన్:
పదోతరగతిలో మాస్‌కాపీయింగ్ లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు కష్టపడి చదవాలని, అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ సూచించారు. జిన్నారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణతాశాతం తక్కువగా ఉండటంతో మంగళవారం కలెక్టర్ స్మితాసబర్వాల్ పాఠశాలను సందర్శించారు. పదోతరగతిలో ఉత్తీర్ణతాశాతం ఎందకు తగ్గుతుందని కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్‌నాయక్, ఎంఈఓ ప్రకాశ్‌లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోనే అట్టడుగు స్థాయిలో జిన్నారం పాఠశాల రెడ్‌జోన్‌లో ఎందుకుందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్న తీరును తెలుసుకున్నారు.
సీ కెటగిరికి చెందిన విద్యార్థులను ఎందుకు అడాప్షన్ చేసుకోవటం లేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మీరు ఏంచేస్తారో నాకు తెలియదు, ఈ ఏడాది మాత్రం ఉత్తీర్ణతాశాతాన్ని పెంచే విధంగా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిట్టీలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, చిట్టీలపై విద్యార్థులు ఆశలు పెట్టుకోవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ స్మితాసబర్వాల్ సందర్శించారు. అర్దవార్షిక పరీక్షల్లో 40మంది విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటయ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన విద్యనుఅ ందించే విదంగా ఉపాధ్యాయులు కష్టపడాలని సూచించారు. పదోతరగతి పరీక్షలకు మరో 50 రోజుల సమయం ఉన్నందును విద్యార్థులను పరీక్షలకు సన్నద్దం చేయాలని సూచించారు.
పదోతరగతిలో విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ సూచించారు. మరో పదిరోజుల్లో జిన్నారంలో పర్యటిస్తానని, అప్పుడు విద్యార్థుల్లో మార్పు కనిపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకునే విధంగా ఎంపీడీఓ, తహశీల్దార్‌లు పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ స్మితాసబర్వాల్ వెంట మెదక్ ఆర్డీవో వనజాదేవీ, జిన్నారం ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
28పిటిసి15 : జిన్నారం : జిన్నారంలోని జెడ్పీపాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్
28పిటిసి15ఏ : జిన్నారం : జిన్నారంలోని జెడ్పీ పాఠశాలలో ఉత్తీర్ణతాశాతం ఎందుకు తగ్గుతుందని ఎంఈవో, పాఠశాల ప్రధానోపాద్యాయుడిని ప్రశ్నిస్తున్న కలెక్టర్
28పిటిసి15బీ : జిన్నారం : జిన్నారంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నతీరుపై వైస్‌ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్న కలెక్టర్
టెన్త్‌లో మాస్‌కాపీయింగ్ లేకుండా చర్యలు
Published Tue, Jan 28 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement