నిన్నటి దాకా గిట్టుబాటు ధర లేక రైతుల ఆశలను అడియాసలు చేసిన టమాట.. ప్రస్తుతం ఊరటనిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 30 కేజీల టమాట బాక్స్ వెయ్యి రూపాయలు పలికింది. ఆ తర్వాత డిసెంబర్, జనవరి నెలల్లో ఒక్కసారిగా 30 కేజీల బాక్స్ రూ. 30కు పడిపోయింది. దీంతో టమాటాలను మార్కెట్‌కు తరలిస్తే కూలీల ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు పొలాల్లోనే వదిలేశారు. లాభాలు వస్తాయనుకున్న రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. కనగానపల్లి మండలంలోనే సుమారు వెయ్యి ఎకరాల్లో టమాట సాగు చేశారు.
అయితే నాలుగు రోజుల నుంచి మార్కెట్లో టమాట ధర క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లో 30 కేజీల బాక్స్ రూ.150 దాకా పలుకుతోందని రైతులు చెబుతున్నారు. రవాణా ఖర్చులు పోనూ వంద రూపాయల దాగా మిగులుతోందని రైతులు నారాయణప్ప, వెంకటేష్, నాగిరెడ్డి, సూరి, లక్ష్మినారాయణ తెలిపారు. బాక్స్ రూ.300 పలికితే లాభసాటిగా ఉంటుందని రైతు పక్కీరప్ప అన్నారు.
టమాట.. ఊరట..
Published Fri, Mar 14 2014 3:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement