టీడీపీలో.. కరివేపాకులు | TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో.. కరివేపాకులు

Published Sat, Feb 14 2015 3:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

TDP

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రలోభాలు.. బెదిరింపులకు లొంగి ‘పచ్చ’ కండువా కప్పుకున్న వారికి టీడీపీలో తిరస్కారాలు.. అవమానాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా వారికి ఆహ్వానమే లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిలాంటి పార్టీని వదులుకొని టీడీపీలో చేరినందుకు తగిన శాస్తి జరుగుతోందని కుమిలిపోతున్నారు.
 
 
 ఓట్ల కోసం.. పదవుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ మారేది లేదన్న వారిని సైతం రకరకాల బెదిరింపులకు గురిచేసి పచ్చకండువా కప్పారు. అయితే వారి అవసరం తీరాక కరివేపాకుల్లా విసిరిపారేశారు. ఇటీవల నగరంలో మూడురోజుల పాటు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులిస్తే ఊరుకునేది లేదని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత సైతం మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు కట్టబెట్టాలని చెప్ప టం గమనార్హం. ఇకపోతే నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అజీజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. అయితే ఆయనను టీడీపీలోని రెండువర్గాలు అస్సలు పట్టించుకోవటం లేదని తెలిసింది. నగరంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తామన్న నిధుల మాటెత్తటం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు. ఆయనతో పాటు వెళ్లిన కార్పొరేటర్లకు సైతం టీడీపీలో అవమానాల పాలవుతున్నట్లు వెల్లడించారు.
 
 జడ్పీటీసీలను పట్టించుకోని తమ్ముళ్లు :
 జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన 8మంది జెడ్పీటీసీలకు బలవంతంగా పచ్చకండువాలు కప్పారు. వీరిలో కొందరిని కిడ్నాప్‌చేసి భయపెట్టి టీడీపీకి మద్దతుఇవ్వాలని ఒత్తిడి చేశా రు. అయితే వారికి ఇప్పుడు ఆయా మండలాల్లో టీడీపీ నేతలు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని సమాచారం. టీడీపీ కార్యక్రమాలు నిర్వహించినా సమాచారం కూడా ఇవ్వటం లేదు.
 
  సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్  నిర్వహించారు. ఆకార్యక్రమంలో దొరవారిసత్రం జెడ్పీటీసీ ముప్పాళ్ల విజితను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. పెద్దఎత్తున నిర్వహించిన కార్యక్రమాల్లో కనీసం ప్రొటోకాల్ పాటించిన పాపాన పోలేదు. భారీఎత్తున వెలసిన ఫ్లెక్సీల్లో జెడ్పీటీసీ ఫొటో ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా చిట్టమూరు జెడ్పీటీసీ భారతి పట్ల స్థానిక టీడీపీ నేతలు ఇదేరకం గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానిం చడంలేదు. అదేవిధంగా మిగిలిన ఆరుగురి పరిస్థితీ ఇదేవిధంగా ఉందని వారి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 బడా నేతలకు తప్పని అవమనాలు
 మాజీ ఎమ్మెల్యే నెలవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయి తే ఆయన్ను టీడీపీ నేతలు ఎవ్వరూ పట్టిం చుకోవటం లేదు. ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల్లో వేదికపైన  తనకు తానే వెళ్లి కూర్చు న్నా.. మాట్లాడేందుకు అవకాశమే ఇవ్వలేదు. అదేవిధంగా ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు.
 
 అయితే ఆయనకూ పార్టీలో పెద్దగా గుర్తింపు నివ్వటం లేదని సమాచారం. నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి పీఆర్పీ, ఆతర్వాత కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అయితే ఆయనకు టీడీపీలో తగిన గుర్తింపు ఇవ్వటం లేదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదేవిధంగా ఆనం కుటుం బం నుంచి వెంకటరమణారెడ్డి, జయకుమార్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరా రు. అయితే వారిని ఆదాల తప్ప మిగిలిన నేతలు చేరదీయటం లేదు. అదేవిధంగా కాంగ్రెస్‌లో ఉన్న చాట్ల నరసింహారావు టీడీపీలో చేరారు. అయితే చాట్లను మంత్రి వర్గం తప్ప మిగిలిన టీడీపీవర్గాలు పట్టిం చుకోవటం లేదు. విజయాడెయిరీ చైర్మన్ రంగారెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, వైవీ రామిరెడ్డి, స్వర్ణా వెంకయ్య, హరిబాబు యాదవ్, కోటేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయితే వారిని ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement