ఎమ్మెల్యే ఆమంచి వర్గంపై టీడీపీ రాళ్లదాడి | TDP activists throwing stones in mla krishna mohan supporters | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆమంచి వర్గంపై టీడీపీ రాళ్లదాడి

Jul 3 2014 1:30 PM | Updated on Aug 10 2018 8:46 PM

ప్రకాశం జిల్లా చీరాల స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంపై తెలుగుదేశం పార్టీ వర్గీయులు రాళ్లదాడి చేశారు.

చీరాల : ప్రకాశం జిల్లా చీరాల స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంపై తెలుగుదేశం పార్టీ వర్గీయులు రాళ్లదాడి చేశారు. చీరాల మున్సిపల్ వైస్ ఛైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆమంచి వర్గం మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ  కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఎస్ఐ రామిరెడ్డి గాయపడ్డారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement