అంగన్‌వాడీల్లో ప్రీ స్కూల్స్‌ బోధన జాడేదీ? | TDP Delayed Pre Schools in Prakasam | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ప్రీ స్కూల్స్‌ బోధన జాడేదీ?

Published Sat, Jun 1 2019 1:33 PM | Last Updated on Sat, Jun 1 2019 1:33 PM

TDP Delayed Pre Schools in Prakasam - Sakshi

గోడపై ప్రీ స్కూల్స్‌బోర్డు

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మారుస్తామన్న గత తెలుగుదేశం ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. కార్పొరెట్‌ స్కూల్స్‌కు ధీటుగా తీర్చి దిద్దుతామని చిన్నారులకు చిన్ననాటి నుంచే ఇంగ్లిష్‌ బోధన అలావాటు చేస్తామని టీవీ, ప్రొజెక్టర్‌ ద్వారా విద్యా బోధన అందిస్తామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఎర్పాటు చేస్తామని మాజీ మంత్రి నారాయణ చెప్పిన మాటలకు అక్షరాల నాలుగు సంవత్సరాలు. అవి ఇప్పటికీ ఆతీగతీ లేదు. ప్రీ స్కూల్స్‌ బోధన దేవుడెరుగు.అంగన్‌వాడీ సెంటర్లలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించటంలో గత ప్రభుత్వంఅలసత్వం వహించింది.

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లా వ్యాప్తంగా సగనికి పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఆధ్వానంగా ఉన్నాయి. గత పాలకులు అంగన్‌వాడీ సెంటర్లను నిర్లక్ష్యం చేశారు. గొప్పలకు పోయి పబ్లిసిటీ చేసుకోటానికి కొన్ని సెంటర్లకు రంగులు వేయించారు. అంగన్‌వాడీ సెంటర్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామాని ప్రగల్భాలు పలికారు.  ప్రభుత్వ ఉద్యోగులను ఎన్ని విధాల వాడుకోవాలో టీడీపీ పాలకులకు తేలిసిన విధంగా ప్రపంచంలో ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయటమే కాదు పల్స్‌ సర్వే, పల్స్‌ పోలియో జనాభా లెక్కలు, ఇలా ఒకటేమిటి ప్రభుత్వం చేసే ప్రతి పనికీ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అంగన్‌వాడీ కార్యకర్తలు సెంటర్లలో కంటే ఎక్కువ రోజులు ప్రభుత్వ పథకాల ప్రచారంతోనే బయట గడుపుతారు. సగనికిపైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో టీవీ, ప్రొజెక్టర్‌ నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఇంగ్లిష్‌ మీడియం బుక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అవి కేంద్రాల్లో  నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రీ స్కూల్స్‌ జిల్లా కోఆర్డినేటర్‌గా గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఒక అధికారిని కుడా నియమించింది. అయినా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎటువంటి మార్పు రాలేదు. పర్యవేక్షణ లోపంతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలకు సక్రమంగా దిశా నిర్దేశం చేయటంలో కోఆర్డినేటర్‌ పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా 534 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా గత ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. సుమారు 50 వేల మంది చిన్నారులు ప్రీ స్కూల్స్‌ సెంటర్లలో ఉన్నారు. గడిచిన ఎడాది నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలకు సార్వత్రిక ఎన్నికల హడావిడిలో గడిపారు. గత ఏడాది చిన్నారులకు విద్య కుడా సక్రమంగా చేప్పలేని పరిస్థితి. ఈ వేసవిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు మే 15 నుంచి 31 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. జూన్‌ 1 నుంచి చిన్నారులకు కొత్త విద్యా సంవత్సరం బోధన ప్రారంభం కాబోతుంది. కోంత మంది అధికారులు కేంద్రాల్లో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో పర్యేవేక్షించాల్సింది పోయి. మిగతా వాటిపై ఎక్కువ దృష్టి సాధిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క కార్యకర్తలకు సక్రమంగా జీతలను కుడా అందడంలేదని గత ప్రభుత్వాలు. మూడు నెలలకు ఒకసారి నాల్గు నెలలకు ఒక సారి ఇచ్చే జీతాలను కాకుండా సేంటర్లకు కనీసం అద్దెలు కుడా సక్రమంగా అందించలేని పరిస్థితి నెలకొని ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వదిలి చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement