రవాణా కమిషనర్‌ను కోరిన టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్ర విభజన జరగనున్న నేపథ్యంలో వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను వెంటనే నిలుపుద ల చేయాలని ప్రభుత్వాన్ని టీడీపీ కోరింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, జి. జైపాల్‌యాదవ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సోమవారం రవాణా కమిషనర్ అనంత రాములుకు ఓ వినతిపత్రం అందచేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రస్తుతం అసెంబ్లీలో ఉందని, త్వరలో విభజన జరగబోతోందని తమ వినతిపత్రంలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ తరుణంలో సాధారణ నంబర్ ప్లేట్ల స్థానంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలనే ఉత్తర్వులను నిలిపేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల తయారీకి అయ్యే ఖర్చు మన రాష్ర్టంతో పోలిస్తే 25 శాతం తక్కువగా ఉందని, ఈ నిబంధన అమలు చేసే ముందు ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు.
జవాన్ల మృతిపట్ల చంద్రబాబు సంతాపం: దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతిదళంపై రెండు వేల మంది ఆందోళనకారులు దాడి చేసిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు మృతిచెందటం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘హై సెక్యూరిటీ’ని ఆపండి
Published Tue, Dec 24 2013 12:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement