నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు వేసినందుకు రామన్నపాళెంకు చెందిన టీడీపీ నేత డేగా దయాకర్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రామన్నపాళెంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎమ్మెల్యేకు, దయాకర్రెడ్డికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. సబ్ స్టేషన్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఈ క్రమంలో అనేక పర్యాయాలు సబ్ స్టేషన్ వద్ద దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా చేశారు. లేకుంటే ఆత్మహత్యకైనా సిద్ధమని దయాకర్ రెడ్డి ప్రకటించాడు.
ఈ సందర్భంగా సబ్ స్టేషన్లో ఉద్యోగాల భర్తీ విషయంపై ఒక కరపత్రం విడుదలైంది.ఎమ్మెల్యే, ఆయన సోదరుడు స్థానిక నిరుద్యోగుల పొట్టకొట్టి సబ్ స్టేషన్లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దాంతో ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు దయాకర్రెడ్డితో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కోవూరు టీడీపీ నేతల మధ్య విభేదాలు
Published Tue, Feb 3 2015 9:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement