ఇసుక రీచ్‌ల కోసం తెలుగు తమ్ముళ్ల తన్నులాట! | TDP Leaders fight each other for Sand reaches in Vijayawada | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌ల కోసం తెలుగు తమ్ముళ్ల తన్నులాట!

Published Fri, Aug 21 2015 7:16 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

TDP Leaders fight each other for Sand reaches in Vijayawada

ఇబ్రహీంపట్నం (విజయవాడ) : ఇసుక రీచ్‌ల కేటాయింపుల విషయంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఈ విషయం కృష్ణా జిల్లా గొల్లపూడి మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన టీడీపీ నేత పీతా శ్రీనివాసరావు.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలసి తనకు కూడా ఓ ఇసుక రీచ్‌ను కేటాయించాలని కోరాడు.

అయితే దీనిని వ్యతిరేకించిన గొల్లపూడికి చెందిన స్థానిక టీడీపీ నేతలు పీతా శ్రీనివాసరావును చితకబాదినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement