చీపురుపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు
విజయనగరం, చీపురుపల్లి: రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని అందుకనే చివరి ప్రయత్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలతో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలో అక్రమంగా ఓట్లు తొలగించేందుకు వేలల్లో దరఖాస్తులు రావడాన్ని నిరసిస్తూ గురువారం నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని లావేరురోడ్‌లో గల పార్టీ కార్యాలయం వద్ద జిల్లా నాయకులు మజ్జి శ్రీనివాసరావు, బెల్లాన చంద్రశేఖర్ నేతృత్వంలో ర్యాలీ ప్రారంభించి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగించారు. అక్కడ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సాల్మన్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఓట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇదే చివరి ప్రయత్నంగా అక్రమ మార్గంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. జిల్లాలోని చీపురుపల్లి నియోజవకర్గంలో మాత్రమే కాకుండా బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, ఎచ్చెర్ల, విజయనగరం నియోజవకర్గాల్లో ఓట్లు తొలగింపు ప్రక్రియ అన్యాయంగా జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ నేతృత్వంలో బృందాలు జిల్లాలో దిగి సర్వే పేరుతో ఓట్లు తొలగించే ప్రక్రియను చేపట్టారన్నారు.
ఈ ప్రక్రియను జిల్లాలో అడ్డుకున్నామని దీంతో మరో దారిలో టీడీపీ ఓట్లు తొలగించే ప్రక్రియకు తెర తీసిందన్నారు. ప్రజాస్వామ్యంలో దారుణమైన ఈ సంఘటనలపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఓట్లు తొలగింపు ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఓట్లు ఉన్నాయో వాటినే అపహాస్యం చేసే విధంగా చర్యలు చేపడుతున్న టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపాలని కోరారు. అంతేకాకుండా ఎన్నికల రోజు వరకు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు ఉందో లేదో చూసుకోవాలని కోరారు. ఎన్నికల కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎస్‌వి.రమణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, నాఫెడ్ డైరెక్టర్ కెవి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండల పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వాకాడ శ్రీనివాసరావు, తాడ్డి కృష్ణారావు, శీర అప్పలనాయుడు, మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, చందక గురునాయుడు, బెల్లాన త్రినాధ్, పనస అప్పారావు, బాణాన శ్రీనివాసరావు, రఘుమండ త్రినాధ్, కరిమజ్జి శ్రీనివాసరావు, గరివిడి మండల నాయకులు పొన్నాడ వెంకటరమణ, మీసాల విశ్వేశ్వరరావు, కొణిశ కృష్ణంనాయుడు, లెంక శ్రీరాములు, యడ్ల అప్పారావు, యలకల అప్పలనాయుడు, మెరకముడిదాం మండల నాయకులు కోట్లు విశ్వేశ్వరరావు, తాడ్డి వేణు, బూర్లె నరేష్, కోట్ల మోతీలాల్‌నాయుడు, గుర్ల మండల నాయకులు పొట్నూరు సన్యాశినాయుడు, వరదా ఈశ్వరరావు, బెల్లాన బంగారునాయుడు, కెంగువ మధు, తోట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment