2090లో కూడా టీడీపీ అధికారంలోకి రాదు: హరీష్ రావు
2090లో కూడా టీడీపీ అధికారంలోకి రాదు: హరీష్ రావు
Published Mon, May 19 2014 4:26 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఖాళీకాక తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజలు, అన్ని పార్టీల నేతలకు టీఆర్ఎస్ పై విశ్వాసం పెరుగుతోందన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ నేతలు కంటున్న కలలు ఓ భ్రమనే అని హరీష్ అన్నారు.
2019లోనే కాదు, 2090లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని హరీష్ అన్నారు. ఇకనుంచి ప్రతిరోజూ టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతాయని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రాంత పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించరని హరీష్ రావు అన్నారు.
Advertisement
Advertisement