తెలంగాణలో నమో మంత్రం నడవదు | does not run the mantra namo in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నమో మంత్రం నడవదు

Published Thu, Apr 24 2014 11:49 PM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

does not run the mantra namo in telangana

 గజ్వేల్, న్యూస్‌లైన్:  తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఈనెల 30 తర్వాత ఈ ప్రాంతంలో టీడీపీ పూర్తి కనుమరుగవడం ఖాయమని టీఆర్‌ఎస్ అగ్రనేత హరీష్‌రావు అన్నారు. గురువారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. చంద్రబాబు ఓట్లకోసం మోడీ ముఖం వేసుకోవాల్సిన దౌర్భగ్యస్థితికి దిగజారాడన్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకోవడం వల్ల బీజేపీ పవిత్రత కూడా దెబ్బతిందన్నారు.

 తెలంగాణలో నరేంద్ర మోడీ మంత్రం ఏమాత్రం నడవదన్నారు. బీజేపీ- టీడీపీల పొత్తు నచ్చక చాలామంది కమలనాథులు టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ‘బాబు’తో పొత్తుకు దిగితే ఎవరైనా సరే మాడి మసై పోవాల్సిందేనన్నారు. ైెహ దరాబాద్‌లో నిర్వహించిన నరేంద్రమోడీ సభ అట్టర్‌ప్లాప్ కావడమే ఇందుకు నిదర్శమన్నారు.  చంద్రబాబుది స్వార్థం రాజకీయమన్నారు.  అనంతరం ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి ప్రసంగించారు. సమావేశంలో మాజీ మంత్రి క్రిష్ణ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు రాములునాయక్ పాల్గొన్నారు.

 జతకట్టి..జనం మద్దతు పోగొట్టుకున్నారు
 సిద్దిపేట జోన్: టీడీపీతో జతకట్టి బీజేపీ జన మద్దతు కోల్పోయిందని  సిద్దిపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీష్‌రావు అన్నారు.  గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన ఉనికిని కాపాడుకునే క్రమంలో చంద్రబాబు నరేంద్రమోడీ, పవన్‌కళ్యాణ్‌ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న పొన్నాల, దామోదరలకు టీఆర్‌ఎస్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి చెమటలు పడుతున్నాయన్నారు. ఎవరెంతగా ప్రయత్నించినా టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరన్నారు. అంతకు ముందు బీజేవైఎం, టీడీపీ, పార్టీలకు చెందిన కార్యకర్తలు హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement