దివ్యశ్రీ తల్లిని ఓదార్చుతున్న వరలక్ష్మమ్మ
పొదిలి: మండలంలోని గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన దివ్యశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సోమవారం ఉప్పలపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిలు దివ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించారు. ఉప్పలపాడు ఉపాధ్యాయులు రూ.25వేలు, డీఈఓ అందచేసిన రూ.10వేలు మొత్తం రూ.35వేల నగదు సాయం కుటుంబ సభ్యులకు అందచేశారు.
కార్యక్రమంలో పీఈటీ దోర్నాల వరలక్ష్మమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రోజారాణి, అబ్దుల్‌హై, బాలకాశిరెడ్డి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి,ఉడుముల శ్రీనివాసులరెడ్డి కరీముల్లా, సంధాని, శివకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment