బిల్లు పెట్టేవరకు కాంగ్రెస్‌ను నమ్మేదిలేదు
Published Mon, Aug 5 2013 5:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి అమోదించేవరకు కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే బీజేపీ అగ్ర నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సభ కోసం ఆదివారం పట్టణంలో నవ భారత్ యువభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణంలో పేర్ల నమోదు కౌంటర్‌ను బుచ్చిరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఏన్‌డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ బిల్లు పెడతామని తమ పార్టీ అగ్రనేతలు పలు మార్లు పేర్కొన్నారన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్నారు.
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినా, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు కట్టడి చేయడంలేదన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టేవరకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరన్నారు. బీజేపీ మతత్వ పార్టీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీలైన ఎంఐఎంతో పొత్తుపెట్టుకుందని, ముస్లిం మైనార్టీలకు ఆ పార్టీ చేసిందేమీలేదన్నారు.జహీరాబాద్‌లో పేర్లనమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లికార్జున్ పాటిల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు బస్వరాజ్‌పాటిల్, అరుణకౌలాస్, రాచప్ప,వేణుగోపాల్,రాఘవేంద్రనాయక్,సుధీర్ భండారి, శ్రీనివాస్‌గుప్తా, అశోక్ బెల్కేరి, సంతోష్, సోమ అనిల్, బండి వెంకట్,రాజ్‌కుమార్ దేశ్‌పాండే,జీవన్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement