కామారెడ్డి, న్యూస్‌లైన్: టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమని కేంద్ర హోంమంత్రిషిండే, దిగ్విజయ్ సింగ్‌లు చెబుతుంటే కేసీఆర్ మాత్రం టీడీపీని భూస్థాపితం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావ్ చేపట్టిన జనచైతన్య సైకిల్‌యాత్ర గురువారం కామారెడ్డిలో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక గాంధీగంజ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో దయాకర్‌రావు మాట్లాడారు.
తామిచ్చిన లేఖతో తెలంగాణ రాలేదని కేసీఆర్ నిరూపిస్తే ముక్కు నేలకురాస్తామని సవాల్ విసిరారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని, యూటీగీటీ అంటే సహించేది లేదన్నారు. తమ పార్టీని రెండు ప్రాంతాల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఉందని, అందుకే ఆయన ఇరు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని మాట్లాడాడని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేశ్ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము చంద్రబాబును డిమండ్ చేసినట్టు తెలిపారు. టీడీపీ తెలంగాణకు వ్యతి రేకమని ఎవరైనా అంటే గల్లాబట్టి గుం జుండ్రని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వేయి మందిని బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు జరుపుకునే హక్కులేదన్నారు. అమరుల కుటుంబాల కాళ్లపై పడి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. టీడీపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.
తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంది...
-ఎమ్మెల్యే మండవ
తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ పార్టీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని పదేపదే ప్రకటించామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితీరుతుందని ఎమ్మెల్యే మం డవ అన్నారు. కాంగ్రెస్ నేతలే తెలంగాణకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ ప్రకట న తరువాత సీమాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టింది కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రేనని అన్నారు. యువకులు టీడీపీలో చేరాలని కోరారు.
టీడీపీ లేఖతోనే తెలంగాణ...
-మాజీ మంత్రి బాబూమోహన్
టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చిం దని, ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాల ని మాజీ మంత్రి బా బూమోహన్ కోరారు. మదన్‌మోహన్ 26రోజుల పాటు ని ర్వహించిన సైకిల్‌యాత్ర అభినందనీయమన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా పని చేసిన తర్వాతనే బీడీ కార్మికులకు కష్టాలు వచ్చాయని అన్నారు. కేసీఆర్ కుటంబం వందల కోట్ల రూపాయలకు అధిపతులయ్యారని విమర్శించారు.
సైకిల్ యాత్ర స్ఫూర్తిదాయకం...
-ఎమ్మెల్యే ఎల్.రమణ
మదన్‌మోహన్ నిర్వహించిన సైకిల్ యాత్ర స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రమణ అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో ఆయన చేపట్టిన యాత్ర విజయవంతమైందన్నారు.
ప్రజలకు సేవచేసేందుకే యాత్ర చేశా..
-మదన్‌మోహన్‌రావ్, జహీరాబాద్ టీడీపీ ఇన్‌చార్జి
ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తా ను నియోజక వర్గంలో 26 రోజుల పాటు సైకిల్‌యాత్ర చేశానని మదన్‌మోహన్‌రావ్ అన్నారు. 373 గ్రామాలు తిరిగిన తాను ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు ఏవగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు లేక యువకులు పడుతున్న ఇబ్బం దులకు పరిష్కారం టీడీపీ పాలనలోనే సాధ్యమని తెలిపారు. సభలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, వీజీగౌడ్, బద్యానాయక్, సభ కు అధ్యక్షత వహించిన నియోజక వర్గ ఇన్‌చార్జి నిట్టు వేణుగోపాల్‌రావ్ మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నజీరొద్దిన్, చీల ప్రభాకర్, ఆనంద్, కుంబాల రవి, మహేశ్, పాషా, ఉస్మాన్ పాల్గొన్నారు.
టీడీపీ లేఖతోనే ‘తెలంగాణ’
Published Fri, Nov 15 2013 5:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement