రూ.15 వేల కోట్లకు లెక్కల్లేవ్! | That's Rs 15 crore! | Sakshi
Sakshi News home page

రూ.15 వేల కోట్లకు లెక్కల్లేవ్!

May 4 2014 2:46 AM | Updated on Sep 5 2018 9:00 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది.

రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ప్రభుత్వానికి అందని యూసీలు
 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కాగ్
 15 రోజుల్లో యూసీలు ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ ఆదేశం

 
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది. విద్యార్థుల కోసం విడుదల చేసే నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడంలో పూర్తి అలసత్వం ప్రదర్శించారని తప్పుబట్టింది. కళాశాలల నుంచి యూసీలు సకాలంలో అందేలా చూడాల్సిన వివిధ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు ఏడేళ్లుగా నిద్రావస్థలో ఉన్నట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2007-08 నుంచి 2014-15 విద్యా సంవత్సరం వరకు 27 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం విడుదలైన రూ. 14,850 కోట్లకు సంబంధించిన యూసీలు ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అందలేదని కాగ్ పేర్కొంది. కాగ్ తప్పుపట్టిన విషయంపై బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ లెటర్ నంబర్ 1399/బి/2014 ద్వారా శనివారం అన్ని సంక్షేమ శాఖల అధికారులకు లేఖలు రాశారు. 15 రోజుల్లోగా జిల్లా అధికారులు యూసీలను సమర్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ మేరకు 23 జిల్లాలకు సంబంధించిన వివరాలు, 2007 నుంచి ఇప్పటి వరకు కాలేజీలు అందజేసిన యూసీలు, ఇంకా యూసీలు ఇవ్వాల్సిన నిధుల వివరాలను అందులో పొందుపర్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో రూ.7,579 కోట్లు, స్కాలర్‌షిప్పుల కింద రూ. 3,743 కోట్లు, ఈబీసీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.3,527 కోట్లకు సంబంధించిన యూసీలు రావలసి ఉందని వివరించారు. వీటిలో స్కాలర్‌షిప్‌లకు సంబంధించే వివిధ శాఖల పరిధిలో రూ. 1,276 కోట్లు విడుదల చేయగా, రూ. 120 కోట్లకు మాత్రమే యూసీలు అందాయని, ఇంకా రూ. 1,156 కోట్లకు యూసీలు అందాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement