శ్రీకాకుళం అర్బన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని అందువల్ల బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, పొన్నాడ రుషి, రత్నాల నరసింహమూర్తి, ముస్తాక్ మహమ్మద్ కోరారు.
వేకువజామునుంచే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళి బస్సులను అడ్డుకుంటామని వారు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సాగదీతధోరణి అవలంబిస్తున్నాయని సీపీఐ, సీపీఎం నాయకులు చాపర సుందరలాల్, భవిరి కృష్ణమూర్తి దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రాష్ట్రబంద్‌కు సహకరించాలని ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ వంటి పలు విద్యార్థి సంఘాలు కోరగా ఇప్పటికే ఆయా పాఠశాలలకు సెలవులు మంజూరు చేసినట్లు సమాచారం. సిటిజన్స్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు బంద్ విజయవంతానికి పిలుపునిచ్చారు.
నేడు జిల్లా బంద్
Published Tue, Aug 11 2015 1:27 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement