బ్యాంకు అధికారులు చేసిన ప్రకటనతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు.
అనంతపురం క్రైం: బ్యాంకు అధికారులు చేసిన ప్రకటనతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని రాప్తాడు మండలం ఎర్రగుంట్లకు చెందిన వై.నారాయణరెడ్డి(57)కి పదెకరాల భూమి ఉంది. ఈ సీజన్‌లో అతడు వేరుశెనగ పంట వేశాడు. వర్షాభావంతో మొలకెత్తలేదు. దీంతోపాటు సాగు కోసం బ్యాంకులో నగలు తాకట్టుపెట్టి తీసుకున్న రుణం చెల్లించకపోవటంతో అధికారులు వాటిని వేలం వేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన వేశారు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణ రెడ్డి ఈనెల 28వ తేదీన పొలంలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. అప్పటి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రైతు శుక్రవారం ఉదయం 8 గంటలకు కన్నుమూశాడు.