
రైల్వేగేటును ఢీకొన్న ఐషర్ వాహనం
రైల్వే గేటును ఐషర్ వాహనం ఢీకొనడంతో తిరుపతి-గుంతకల్లు రైలు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.
20 నిమిషాలు ఆలస్యంగా నడచిన రైలు
ములకలచెరువు: రైల్వే గేటును ఐషర్ వాహనం ఢీకొనడంతో తిరుపతి-గుంతకల్లు రైలు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. సోమవారం వేకువజామున 2.45గంటల తిరుపతి నుండి గుంతకల్లు రైలు వెళ్లే సమయంలో రైల్వే సిబ్బంది గేటు వేస్తుండగా మదనపల్లి నుంచి బత్తలపల్లి వైపునకు ట మాట లోడుతో వెళుతున్న ఐషర్ వాహనం గేటును ఢీకొంది. దీంతో గేటు మధ్యలో విరిగిపోయింది.
అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అధికారులకు సమాచారం అందించి రైలును నిలిపేశారు. దీంతో 20 నిమిషాల వాహనాలు బారులు తీరాయి. రైల్వేసిబ్బంది గేటు మరమ్మతులు చేసిన అనంతరం రైలు బయలుదేరింది. సోమవారం మధ్యాహ్నం మదనపల్లె రైల్వే సిగ్నల్ అధికారి నాగభూషణం సంఘటన స్థలానికి చేరుకుని గేటును పరిశీలించారు. కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.