సాక్షి, రంగారెడ్డి జిల్లా: వర్షాల ధాటికి జిల్లాలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వేల హెక్టార్లలో పం టలు నీటమునగడంతోపాటు పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు వర్షపునీటితో చెరువులు, కుంటలు అలుగెత్తి కాలనీలను ముంచేశాయి. నీటితాకిడికి పలు చెరువులకు గండ్లు పడగా, కాల్వలు తెగిపోయాయి. జిల్లాలో వర్షాల వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలను సిద్ధం చేసేందుకు ఉపక్రమించారు. శుక్రవారం సాయంత్రం నాటికి ప్రాథమికంగా అంచనాలను సేకరించారు. 11,045 ఎకరాల్లో పంటనష్టం వాట్టిల్లిందని గుర్తించారు. ఇందులో 1,795 ఎకరాల్లో పత్తి, 2,337.5 ఎకరాల్లో వరి, 825 ఎకరాల్లో మొక్కజొన్న పంటలతోపాటు పండ్లు, పూలతోటలు, కూరగాయల పంటలున్నాయి. అదేవిధంగా 79 ఇళ్లు పాక్షికంగా మరికొన్ని పూర్తిగా కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పూర్తిస్థాయి వివరాలు సేకరించేందుకు మరింత సమయం పడుతుందని, నష్టం అంచనాలు పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
వర్షపాతం 3.4 సెం.మీ.
జిల్లాలో వరుసగా నాలుగో రోజూ భారీ వర్షపాతమే నమోదైంది. అధికార గణాంకాల ప్రకారం గురువారం నుంచి శుక్రవారం ఉదయం నాటి కి జిల్లాలో 3.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోైదె ంది. గ్రామీణ మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదు కాగా, తూర్పు డివిజన్లలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. అధికంగా కందుకూరు మండలంలో 11.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యాచారంలో 10.7 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 10.3, హయత్‌నగర్‌లో 9.8 ఇబ్రహీంపట్నంలో 8.6, మంచాలలో 8, శంషాబాద్‌లో 5.9 సెంటీమీటర్లు నమోదైంది. జిల్లాలో అత్యల్పంగా తాండూరు మండలంలో 0.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కన్నీరే మిగిలింది..
Published Sat, Oct 26 2013 12:05 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM