సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కోర్సుల సిలబస్‌లో మార్పులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులోభాగంగా విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌లను పరిశ్రమల నేతృత్వంలోనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ శాతం విద్యార్థులు నామమాత్రంగానే ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసి కోర్సును ముగిస్తున్నారు. ఇకపై ప్రాజెక్టు వర్క్ అనేది పరిశ్రమల అవసరాలకు, విద్యార్థి ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడేలా ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇటీవల పారిశ్రామికవర్గాలు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించింది. ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరిశ్రమల నేతృత్వంలోనే ప్రాజెక్టులు చేసేలా మార్పు తీసుకురావడంపై తుది నిర్ణయం తీసుకోనుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వృత్తి విద్యా కోర్సులు ఉం డేలా, కోర్సు పూర్తి చేయగానే ఉపాధి అవకాశాలు లభించేలా సిలబస్‌లో మార్పులపైనా దృష్టి సారించనుంది.
ఐటీ రంగాల్లో మారే టెక్నాలజీలకు అనుగుణంగా విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ఏటా డిగ్రీ పూర్తి చేసుకుంటున్న 90వేల మందికి ఉద్యోగాలు లభించేలా శిక్షణ ఇచ్చేందుకు ‘హైక్వాలిటీ ఫినిషింగ్ స్కూల్’ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది.
డమ్మీ ప్రాజెక్టు వర్కులకు చెక్!
Published Fri, Dec 12 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement