పోరాటాల ఫలితమే తెలంగాణ | The result of the struggle Telangana | Sakshi
Sakshi News home page

పోరాటాల ఫలితమే తెలంగాణ

Published Mon, Sep 30 2013 2:26 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

The result of the struggle Telangana

దుగ్గొండి, న్యూస్‌లైన్ :  తెలంగాణలో జరిగిన సుదీర్ఘ  పోరాటాలను గుర్తించే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ రాష్ర్ట ఏర్పాటు ప్రకటన చేసిందని కేంద్ర సామాజిక న్యాయసాధికారతశాఖ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు.  మండలంలోని తిమ్మంపేట లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ‘ఇంటింటికి కాంగ్రెస్ జెండా- సోనియా అండ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ పతాకాలను ఆవిష్కరించగా, కార్యకర్తల ఇళ్లకు మంత్రి బలరాంనాయక్ స్వయంగా పార్టీ జెండాలు కట్టి ఉత్తేజపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
 
 సీమాంధ్ర నాయకులు కృత్రిమ ఉద్యమాలు చేసి రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ఏర్పాటు ఆగదని పేర్కొన్నారు. సోనియాగాంధీ ఆహారభద్రత, ఎస్సీ, ఎస్టీసబ్ ప్లాన్ లాం టి బిల్లులతో నిరుపేదల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. నర్సంపేట, ములు గు, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు ఏడాదిలో తాగు, సాగునీటికి ఢోకా ఉండదన్నారు. నర్సంపేట మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.105 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. సభలో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, సర్పంచ్ నరహరి రమాదేవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిడి రవీందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, రడం శ్రీనివాస్, బాబు, పానకాల్‌రెడ్డి, రాజు, రామానంద్ పాల్గొన్నారు. 
 
 పంచాయతీ భవనం ప్రారంభం..
 మండలంలోని బొబ్బరోనిపల్లిలో ఉపాధిహామీ పథకంలో భాగంగా రూ.10లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని కేంద్ర మంత్రి బలరాంనాయక్ స్థానిక సర్పంచ్ శంకేషి శోభాకమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement