అటు పాఠం.. ఇటు బేరం! | The text of the bargain ..! | Sakshi
Sakshi News home page

అటు పాఠం.. ఇటు బేరం!

Published Sat, Jun 28 2014 11:53 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

The text of the bargain ..!

 సత్తెనపల్లి: వేలకు వేలు డొనేషన్లు.. అదే స్థారుు ఫీజులు... ఇలా విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేటు పాఠశాలలు మరో విధంగానూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారుు. సొంతంగా పుస్తకాలు విక్రరుుస్తూ.. టైలు, బెల్టులు, బ్యాడ్జీలు అంటగడుతూ దోచుకుంటున్నారుు. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది.
 
 పాఠశాలల్లోనే కొనాలని హుకుం
 జిల్లాలోని 57 మండలాల్లో ప్రభుత్వ గుర్తింపు కలిగిన ప్రైవేట్ పాఠశాలలు 794 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక విద్యను అందిస్తున్న పాఠశాలలే అధికం. చాలా పాఠశాలలు విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారుు. అంతటితో ఆగకుండా పుస్తకాలు, యూనిఫాంలు, టైలు, బెల్టులు, బ్యాడ్జీలు తమ వద్దే కొనుగోలు చేయూలని హుకుం జారీ చేస్తున్నారుు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వసూలు చేస్తూ దోచుకుంటున్నారుు. గుంటూరు నగరం, నర్సరావుపేట, బాపట్ల, తెనాలి, సత్తెనపల్లి వంటి పట్టణాలతోపాటు గ్రామాల్లోని పాఠశాలలన్నీ ఇదే బాటలో నడుస్తున్నారుు.
 
 అనుమతులు నిల్.. పాఠ్య, నోట్ పుస్తకాలతోపాటు ఇతర వస్తువుల విక్రయాలకు విద్యా శాఖతోపాటు మున్సిపల్, పంచాయతీ, వాణిజ్య పన్నుల శాఖల అనుమతి తప్పనిసరి. నిర్ణీత రుసుములు చెల్లించి లెసైన్సు పొందినవారే అమ్మకాలు చేపట్టాలి. కానీ ఇవేమీ లేకుండానే విక్రయూలు జరుపుతూ పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు. అరుునా ఆయూ శాఖల అధికారులు పట్టించుకోవటం లేదు. పాఠశాలల యూజమాన్యాల నుంచి మామూళ్లు ముడుతున్నందువల్లే వారిలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నారుు.
 
 కమీషన్ల కోసమే దందా..
 పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రిని అమ్మే ఏజెన్సీల నుంచి భారీగా కమీషన్లు లభిస్తుండటం వల్లే ప్రైవేట్ పాఠశాలలు ఈ దందాకు పాల్పడుతున్నారుు. ప్రస్తుతం నర్సరీ చదివే విద్యార్థి పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రికి దాదాపు రూ.3 వేలు ఖర్చవుతుండగా ఒకటి నుంచి 5వ తరగతి పిల్లలకు 5 వేల రూపాయల వరకు అవసరమవుతోంది. ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
 నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
 ఈ విషయమై ఉప విద్యాశాఖ అధికారి పి.వి.శేషుబాబును వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో స్టేట్ సిలబస్ పుస్తకాలు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఇతర పుస్తకాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇలా చేస్తున్న పాఠశాలలపై కూడా చర్యలు తప్పవన్నారు. పాఠశాల యూజమాన్యాల అక్రమాలపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement