ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి గస్తీ సందర్భంగా అరెస్ట్ చేశారు.
పుంగనూరు: ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి గస్తీ సందర్భంగా అరెస్ట్ చేశారు. రాత్రి గస్తీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన రామాచారి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టు విప్పాడు. ఇతడు మరికొందరితో కలసి పుంగనూరు, పరిసర ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల విలువ జేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.