పీఎన్‌కాలనీ : మా ప్రాంతంలో థర్మల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తమ ప్రాణాలను బలితీసుకోవద్దని పోలాకి మండల ప్రజలు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీనరసింహం వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, అదనపు సంయుక్త కలెక్టర్ రజనీకాంతారావు, ఆర్‌డబ్ల్యూఎస్ పీడీ కూర్మనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలాకి మండల వాసులు కలెక్టర్‌తో మాట్లాడుతూ జపాన్ దేశానికి చెందిన తోసిబా సుమిటోమో క్రిటికల్ థర్మల్ ప్లాంట్‌ను నిర్మించేందుకు తమ ప్రాంతంలోని కోరాడ లచ్చయ్యపేట, చీడివలస, చెల్లాయివలస, తోటాడ ప్రాంతాల్లో పర్యటించారని వివరించారు. ప్లాంట్ ఏర్పాటు చేస్తే హరిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంగా బీడు మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని స్పష్టం చేశారు. కలెక్టర్‌ను కలసిన వారిలో పోలాకి గ్రామానికి చెందిన బైరాగినాయుడు, బలగ ముకుందరావు, ఆనందరావు, భీమారావు, నాగభూషణరావు, శంకరరావు, వైకుంఠరావు ఉన్నారు. ఈ వారం వచ్చిన వినతుల్లో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న 382 మంది ఉద్యోగులకు10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, దీంతో అవస్థలు పడుతున్నామని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జీతాలు అందాక అందక పోవడంతో కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. కొత్త పీఆర్సీ అమలు చేయాని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యుచేయాలని, హెల్త్‌కార్డులు మంజూరు చేసి ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలని కోరుతూ యునెటైడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.సాయిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు సోమసుందరరావులు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
బేడ(బుడ్గ) జంగాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని ఆ కుల సంఘం ప్రతినిధులు కలెక్టర్‌కు వినతి అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఆదరణకు నోచుకోకుండా తాము వెనుకబడుతున్నామని వాపోయారు. శ్రీముఖలింగంలో వరదకట్టల నిర్మాణ పనులకు వినియోగిస్తున్న మట్టిని కబ్జా చేస్తున్నారని శ్రీముఖలింగానికి చెంది ఎన్.రాజశేఖర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ అక్కడి దేవాదాయ, పురావస్తుశాఖ సిబ్బంది, గ్రామసర్పంచ్‌తో కుమ్మక్కై 30 లక్షల రూపాయల విలువ చేసే మట్టిని ఇప్పటికే కబ్జా చేశారని, దీన్ని అరికట్టాలని కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇసుక, సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబాలతో సహా వలసలు పోవాల్సి పరిస్థితి ఏర్పడిందని జిల్లా భవన నిర్మాణ కార్మికులు కలెక్టర్‌కు విన్నవించారు. ఇసుక, సిమెంట్ ధరలు తగ్గించి, కార్మికశాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘ ప్రతినిధులు ఎం.హరినాథ్, హరినారాయణ, సీఐటీయూ నాయకుడు ఆదినారాయణమూర్తి కోరారు. మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని శ్రీకాకుళం రూరల్ మండలం పెదగళ్లవానిపేట, చిన్నగనగళ్లవానిపేట, పుక్కళ్లపేట, నరసయ్యపేట, కాజీపేట గ్రామస్తులు కోరారు. గతంలో కన్నెధార కొండపై ఇచ్చిన గ్రానైట్ లీజును రద్దు చేయాలని కోరుతూ భారత కమ్యూనిటీ పార్టీ నాయకులు బి. కృష్ణమూర్తి, తేజేశ్వరరావు వినతిపత్రం అందజేశారు.
వేతనాలు పెంపుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను, వారి మద్దతుగా ఉన్న సీఐటీయూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు కలెక్టర్‌కు అందజేసిన వినతిపత్రంలో కోరారు.
గిరిజన దర్బార్‌లో బిల్లుమడ వాసుల వినతి
సీతంపేట: చెరువు మరమ్మతులు చేయించాలని బిల్లుమడ గ్రామానికి చెందిన కన్నయ్య తదితరులు అధికారులను వేడుకున్నారు. అలాగే రహదారి మంజూరు చేయాలని దాసుగుమ్మడకు చెందిన కువ్వారి గిరిజన దర్బార్‌లో విజ్ఞప్తి చేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పీఎంఆర్‌సీ లో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు ఈ వా రం వినతులు తగ్గాయి. పీఏవో జగన్‌మోహన్, ఈఈ శ్రీని వాస్, డిప్యూటీ ఈవో మల్లయ్య, పీహెచ్‌వో శేఖర్‌లు వినతులు స్వీకరించారు. వీటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైకార్ రుణం మంజూరైనప్పటకీ సబ్సిడీ రాలేదని బందపల్లికి చెందిన రమేష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. వైద్యసాయం అందివ్వాలని గాటి గుమ్మడకు చెందిన ధర్మారావు వినతిని అందజేశారు.
ఉద్యోగ అవకాశం కల్పించాలని కొత్తవూరుకు చెందిన బాలకృష్ణ కోరగా, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని వైద్యం అందజేయాలని బిల్లుమడకు చెందిన కృష్ణారావు కోరారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని మండ గ్రామానికి చెందిన ఆనప ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డులో పేర్లు మార్పు చేయాలని పొల్ల గ్రామానికి చెందిన ఆరిక బెన్నయ్య వినతి అందజేశారు. జగ్గడుగూడకు చెందిన జయమ్మ న్యూట్రీషియన్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. దర్బార్‌లో ఎంపీడీవో గార రవణమ్మ,ఎంఈవో అంబటి సోమేశ్వరరావు, తహశీల్దార్ సావిత్రి, పశువైద్యాధికారులు జి.దిలీప్, ఆర్.శంకరరావు పాల్గొన్నారు. చెరువు మరమ్మతులు చేయించాలి