సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ధరూర్, గట్టు మండలాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు మంత్రి డీకే అరుణ మంగళవారం తెలిపారు. 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలను సీఎంకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ప్లాంటుకు అవసరమైన నీటికోసం జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ప్రాజెక్టు ఏర్పాటుతో జిల్లాలోని ఎత్తిపోతల పథకాలతోపాటు, విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో థర్మల్ ప్లాంటు!
Published Wed, Jan 8 2014 12:53 AM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM
Advertisement
Advertisement