నా మీద మొరుగుడే కానీ... సోనియాని అడగలేరు | they are barking on me, but not asking Sonia gandhi, Chandra babu Naidu criticises congress | Sakshi
Sakshi News home page

నా మీద మొరుగుడే కానీ... సోనియాని అడగలేరు

Published Tue, Sep 3 2013 2:25 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

they are barking on me, but not asking Sonia gandhi, Chandra babu Naidu criticises congress

గుంటూరు : సీట్లు, ఓట్లు కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిచ్చు పెడుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఆయన మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరులో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్ ఉన్నా.... సొంత రాష్ట్రం కాబట్టి పట్టించుకోవటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటుందోని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలని.... తన మీద మొరుగుతారే కానీ, సోనియాని అడగలేరని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తామని మరోసారి చంద్రబాబు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement