చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సదుం మండలకేంద్రంలో భూపతి(22) అనే దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
పుంగనూరు మండలపరిధిలోని పలుగ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద వివిధ సామాగ్రిని దొంగిలించిన కేసుల్లో భూపతి నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. సదుం మండలం కొత్తపల్లికి చెందిన భూపతి సదుం పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుంచి రూ.10 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.