విభజన’ ఎమర్జెన్సీని తలపిస్తుంది.
విభజన’ ఎమర్జెన్సీని తలపిస్తుంది.
గూడూరు, దేశ చరిత్రలో రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ఆమోదించిన రోజు చీకటి రోజని.. ఎమర్జెన్సీని తలపించేలా లోక్‌సభలోకి మీడియాకు కూడా ప్రవేశం లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టవర్‌క్లాక్ సెంటర్ నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరి ముత్యాలపేట మీదుగా రైల్వే స్టేషన్, రాజావీధి మీదుగా గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకున్నారు.
అక్కడ్నుంచి సంగం థియేటర్ మీదుగా తిరిగి టవర్‌క్లాక్ సెంటర్‌కు ర్యాలీ చేరింది. అక్కడ రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బంద్‌కు మద్దతుగా పట్టణంలోని దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. ఈ సందర్భంగా ఎల్లసిరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజల మనోభిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా రాక్షసత్వంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని, ఈ మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో సమైక్య పోరు చేపట్టారన్నారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక బలీయమైన శక్తిగా మారుతుండటంతో అది తట్టుకోలేక ఏ విధంగానైనా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే పాలక, ప్రతిపక్షాలు ఒక్కటై దుశ్చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డేనని, చంద్రబాబు, కిరణ్‌లు రెండు కళ్ల సిద్ధాంతాలు పాటిస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు సీమాంధ్ర ప్రజలు ఓట్లతో గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నాశిన నాగులు, రాజేశ్వరరెడ్డి, ఎల్లా శ్రీనివాసులురెడ్డి, రాజశేఖరరెడ్డి, శివకుమార్, మధురెడ్డి, సత్యం, లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్లు గురవయ్య, బొమ్మిడి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, పెల్లేటి శ్రీనివాసులురెడ్డి, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, కిరణ్, రంగారెడ్డి, గిరి, బుజ్జయ్యనాయుడు, షణ్ముగం, సరస్వతమ్మ, నవీన్ జయకుమార్, సునీల్, మల్లిగౌడ్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో మోటారుబైక్‌ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూయించారు. ఈ కార్యక్రమంలో బల్లి కల్యాణ్, శీలం కిరణ్‌కుమార్, బిల్లు చెంచురామయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.
వాకాడులో
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వాకాడులో పార్టీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంక్‌లను మూయించి సమైక్య నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంటి వెంకటసుబ్బారెడ్డి, పెళ్లూరు కోటిరెడ్డి, పూనమల్లి బాలకృష్ణయ్య, నజీర్‌బాషా, ఎస్‌కే కాలేషా, కడూరు భాస్కర్, తీపలపూడి చెంగయ్య, రావిగుంటపాళెం రమేష్, సుబ్బయ్య, సుధాకర్ పాల్గొన్నారు.