divided
-
Yogi Adityanath: విడిపోతే ఊచకోతే
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆగ్రాలో దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘విడిపోతే ఊచకోత కోస్తారు’ అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఏమవుతోందో చూస్తున్నారుగా! ఆ తప్పిదాలను భారత్‌లో పునరావృతం చేయొద్దు. విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఊచకోత కోస్తారు. కలిసుంటేనే సురక్షితంగా ఉండగలం. అభివృద్ధి చెందగలం’’ అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో కూడా యోగి పోస్ట్ చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముస్లిం విద్వేషంతో యూపీని విడదీస్తున్నదే యోగి అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘‘మైనారిటీల ఇళ్లపైకి ఆయన ఇప్పటికే బుల్డోజర్లు నడుపుతున్నారు. ఇప్పుడిలా మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. యూపీని మతపరంగా మరింతగా విడదీయజూస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. సీఎం పదవి చేజారేలా ఉండటంతో అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని యోగికి ఎంత కోరికగా ఉన్నా మరీ ఇప్పట్నుంచే ఇలా విదేశీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. -
Rakesh Tikait: చీలికకు కేంద్రమే కారణం
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరే కంగా నెలల తరబడి పోరాడి మోదీ మెడలు వంచిన రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రధానభూమిక పోషించించింది. అలాంటి ఎస్కేఎంలో తాజా చీలిక కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ కుట్రలు ఫలించడం వల్లే సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర)పేరిట మరో రైతు సంఘం పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు. ఎస్‌కేఎంకు ఎస్కేఎం(రాజకీయేతర)కు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్ఎస్ఎస్ నేతలే రైతులుగా.. ‘‘ ఒక్కటిగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేమని గ్రహించే 41 రైతుల సంఘాల కూటమి అయిన ఎస్కేఎంలో సర్కార్ చీలిక తెచ్చింది. కొత్త సంఘం ఎస్కేఎం(రాజకీయేతర) ఢిల్లీ ఛలో అని పంజాబ్ నుంచి రైతులను తీసుకొచ్చి హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తోంది. అసలు ఈ కార్యక్రమంపై మాతో వాళ్లు మాటవరసకైనా చెప్పలేదు. రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నేతలే రైతులుగా నటిస్తూ పంజాబ్ నుంచి వచ్చిన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ జిల్లాకు 40 దొంగ సంఘాలు ‘‘ఒక్క నోయిడాలోనే భారతీయ కిసాన్ యూనియన్ పేరిట 37 రైతు సంఘాలను తెరిపించారు. వీటికి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారు. పంటలు, ఆ పంటల్ని పండించే కులాలవారీగా సంఘాలు తెరిచారు. జిల్లాకు 30–40 దొంగ సంఘాలు తెరచి రైతులందరినీ గందరగోళపరిచి, విభజించడమే మోదీ సర్కార్ లక్ష్యం’’ ఎర్రకోట ఘటన పోలీసు కుట్ర ‘‘ 2021 జనవరి 26 సంబంధ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంది. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో నిలిపిఉంచిన ట్రాక్టర్లను పోలీసులే ఎర్రకోట వైపు నడిపేలా ఉసిగొల్పారు. నాడు ఉద్యమకారులను పోలీసులే తప్పుదోవ పట్టించారు. సిఫార్సులపై మరోమారు నమ్మం స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో చెప్పింది. పదేళ్లయినా అమలుచేయలేదు. అందుకే 2024 బీజేపీ అజెండాను రైతులు నమ్మట్లేరు. విత్తనాలు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, లీజు ఒప్పందం, ఇంథనం, సాగు ఖర్చులకు రైతు కుటుంబం ఉమ్మడి శ్రమ(ఏ2+ఎఫ్ఎల్)కు వెలకట్టి స్వామినాథన్ సిఫార్సుల్నే అమలుచేశామని కేంద్రం అబద్ధం చెబుతోంది. మేం సాగు ఖర్చుకు 50 శాతం విలువ జోడింపు అంటే సీ2+ 50 శాతం ఫార్ములా(స్వామినాథన్ సిఫార్సు) అమలుచేయాలని డిమాండ్‌చేస్తున్నాం’’ -
బళ్లారి జిల్లా విభజనకు ఆమోదముద్ర
సాక్షి బెంగళూరు : విజయనగర జిల్లా ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. బళ్లారి జిల్లాను రెండుగా విభజించి 31వ జిల్లాగా విజయనగర (హొసపేటె)ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాలోకి హొసపేటె, హరపనహళ్లి, హూవినహడగలి, హగరి బొమ్మనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాలు రానున్నాయి. మిగతా బళ్లారి, సిరుగుప్ప, సండూరు, కురుగోడు, కంప్లి తాలూకాలు బళ్లారి జిల్లాలోనే కొనసాగుతాయని మంత్రివర్గ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మాధుస్వామి మీడియాకు తెలిపారు. (‘గోవధ నిషేధంపై త్వరలోనే బిల్లు’) బళ్లారి జిల్లాలో ఇప్పటివరకు బళ్లారి, హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, కంప్లి, సిరుగుప్ప, సండూరు, హరపనహళ్లి తాలూకాలు ఉన్నాయి. హొసపేటె కేంద్రంగా విజయనగర జిల్లా ఏర్పాటు చేయాలని 20 ఏళ్లుగా డిమాండ్లు ఉన్నాయి. హొసపేటెను విజయనగర జిల్లాగా ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లో ఉన్న హొసపేటె ఎమ్మెల్యే, ప్రస్తుత అటవీ శాఖామంత్రి ఆనంద్‌సింగ్ బీజేపీలో చేరారు. ఇచ్చిన హామీ మేరకు విజయనగర జిల్లా ఏర్పాటుకు ఈనెల 19న జరిగిన కేబినెట్ సమావేశంలో తాత్కాలికంగా ఆమోదం వేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో విజయనగర జిల్లా ఏర్పాటుకు పూర్తి ఆమోదముద్రవేశారు. బళ్లారిని ముక్కలు చేయరాదని బళ్లారి సిటీ బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం విజయనగర జిల్లాకు ఆమోదముద్ర వేసింది. (పవన్ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు) మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ►కర్ణాటక గృహ మండలిలో రూ.2,275 కోట్లతో 98 వసతి పథకాలు అమలు ►ధారవాడ రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో రూ.16.48 కోట్లతో ఉపరితల వంతెన నిర్మాణం ►సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు సహకారంతో ఉత్పాదన కేంద్రం నిర్మాణం, విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ కట్టడ నిర్మాణాలకు రూ.42.93 కోట్ల కేటాయింపు ►ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు ►కర్ణాటక గెజిటెడ్ ప్రొబేషనరీ నియామకాల్లో సవరణలకు ఆమోదం ►బెంగళూరు గ్రామీణ జిల్లా బాశెట్టిహళ్లి, దావణగెరె జిల్లా హొన్నాళిని ప.పం. నుంచి∙పురసభ, బెంగళూరు నగరం యలహంకలోని హుణసమారహళ్లి పురసభ, అథణి, కాగవాడను పట్టణ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ ►శివమొగ్గ విమానాశ్రయం అభివృద్ధికి రూ.380 కోట్లు ►బళ్లారి జిల్లా జిందాల్‌కు భూ కేటాయింపుల కోసం మరోసారి పరిశీలన ►బీబీఎంపీ పరిధిలోకి మల్లసంద్ర, కావల్శెట్టిహళ్లి గ్రామ పంచాయతీలు ►మెట్రో రైలు అనుసంధాన ప్రక్రియలో భాగంగా ముగ్గురు సభ్యులతో కమిటీ ►ఎక్స్పీరియన్స్ బెంగళూరు పథకంలో భాగంగా మైసూరు ల్యాంప్స్ పరిశ్రమలో భూమి, ఉపకరణాల కొనుగోలుకు తీర్మానం -
విభజన రాజకీయాల అడ్డాగా అమెరికా
అమెరికా ఇటీవలి జ్ఞాపకాల్లో కనీవినీ ఎరగనంత స్థాయిలో ఓటర్లను నిలువునా చీల్చివేసిన తాజా ఎన్నికలు దాని ముగింపును కూడా అంతే విభజనతో లిఖించేటట్లు కనబడుతోంది. ప్రపంచంలో అమెరికా స్థాయిని, దాని విలువను తగ్గించే పర్యవసానాలను ఈ విభజన తీసుకొచ్చేటట్టుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది. ఫలితాల వెల్లడి ప్రారంభమైన తొలిరోజే ఏమాత్రం ఆగలేక తానే గెలిచానని ప్రకటించేసుకున్న దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థులు ఎన్నికల ఫలితాలను తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. అమెరికా ప్రజాస్వామ్య సుదీర్ఘకాల ఆరోగ్యం, చట్టబద్ధత గురించి తనకు ఏమాత్రం పట్టింపులేదని నిరూపించుకుంటూ వచ్చిన దేశాధ్యక్షుడు ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి తిరస్కరించడాన్ని ప్రపంచం దిగ్భ్రాంతితో చూస్తోంది. అధ్యక్షుడి అధికారాలను పక్కన బెడితే, రిపబ్లికన్ పార్టీపై ట్రంప్ ప్రస్తుతం చలాయిస్తున్న, భవిష్యత్తులో చలాయించగల ఆధిపత్యం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లయింది. అలాగే ఆర్థికంగా, చట్టపరంగా తాను ఎదుర్కొనబోయే సమస్యలనుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ఆధిపత్య స్థాయిని ఉపయోగించే సామర్థ్యం కూడా క్షీణించిందనే చెప్పాలి. ఓటమిని ట్రంప్ హుందాగా అంగీకరించి తప్పుకునే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైనట్లేనని చెప్పాల్సి ఉంటుంది. బ్యాలెట్లలోని ఓట్లన్నీ లెక్కించాక జో బైడెన్‌కే గెలుపు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తూండవచ్చు కానీ, బైడెన్ ఓడిపోతే మాత్రం డెమొక్రాటిక్ మద్దతుదారులకు అది పెనుదెబ్బ అయ్యే అవకాశం ఉంది. వీరిలో చాలామంది బైడెన్ ఓడిపోయినట్లతే మాత్రం ఈ ఎన్నికలు తమకు వ్యతిరేకంగా జరిగిన రిగ్గింగ్ ఫలితమేనని కూడా భావిస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్నదాంతో పని లేకుండా, 2020వ సంవత్సరంలో ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏ ప్రజాస్వామ్యం కూడా అమెరికాలాగా రాజకీయంగా ఇంతగా వేరుపడిపోయిన పాపాన పోలేదు. ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలకు మించి ట్రంప్ ప్రదర్శించిన అతి చర్యలు, అమెరికా ఓటర్లలో వచ్చిన ఈ విభజనను రాజకీయ పండితుల అంచనాల వల్ల కలిగిన ఫలితంగా కాకుండా అత్యంత వ్యవస్థీకృతంగానే జరిగిన పరిణామమని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాన్ని ఇరు పక్షాల్లో ఏదీ సత్వరమే అంగీకరించబోవడం లేదన్న వాస్తవాన్ని పక్కనబెట్టి చూస్తే, ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. అమెరికా నిరంకుశ రాజ్య వ్యవస్థగా మారిపోనుంది. ఇటీవలి కాలంలో కాస్త బలహీనపడినట్లు కనబడుతున్నప్పటికీ, అమెరికాలోని ప్రజాస్వామ్య సంస్థలు క్రమక్రమంగా.. ప్రభుత్వ విధానాల్లో ప్రజల ప్రత్యక్ష ఇచ్ఛను ప్రతిఫలించే కెనడా లేక జర్మనీ తరహా నిజమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థనుంచి రానురానూ పక్కకు పోతున్నాయి. పైగా హంగరీ, టర్కీల్లాగా అమెరికా ఒక హైబ్రిడ్ రాజకీయ వ్యవస్థ దిశగా సాగిపోతోంది. ఇది పూర్తి నియంతృత్వ వ్యవస్థ అంతటి చెడ్డది కాకపోయినప్పటికీ, అమెరికా మాత్రం ఆ దశవైపే ప్రమాదకరంగా సాగిపోతోంది. అంతిమంగా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసేది ఎవరు అనేదాంతో పనిలేకుండా, గత 50 ఏళ్లతో పోల్చి చూస్తే స్వదేశంలో రాజకీయపరంగా కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఉనికి పరంగా గానీ ఎన్నడూ లేనంత బలహీనంగా అమెరికా రాజకీయ ప్రమాణాలు పడిపోయాయి. దేశీయంగా చూస్తే, రాజకీయ ప్రక్రియలు, స్వేచ్ఛా వ్యాపారం, వలస సమస్య వంటి విధానపరమైన అంశాలపై వాదనలు, చర్చలు మినహా, దేశాన్ని వేరుపర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక సోషల్ మీడియా సైతం విభిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన అమెరికన్లను విడదీసి వేరుచేసే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. దేశీయంగా ఇలా వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం అనేది.. వాతావరణ మార్పు, టెక్నాలజీ క్రమబద్ధీకరణ వంటి కీలకమైన అంశాల్లో అమెరికా ఆధిపత్యాన్ని కష్టసాధ్యం చేస్తోంది. లేదా వాణిజ్యం, భద్రత వంటి సంక్లిష్ట అంశాల్లో ఐక్య సంఘటనతో చైనాకు వ్యతిరేకంగా నిలిచే శక్తి కూడా అమెరికాలో తగ్గుముఖం పడుతోంది. చివరకు బైడెన్ అధ్యక్ష స్థానం చేజిక్కించుకున్నప్పటికీ, రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉండే సెనేట్ను తాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో విదేశీ విధానంపై రాజకీయంగా ఎంత సమర్థంగా బైడెన్ వ్యవహరిస్తారన్నది ప్రశ్నార్థకమే. అమెరికా నుంచి స్ఫూర్తిదాయకమైన, రాజనీతిజ్ఞత కలిగిన ఎన్నికలకోసం తక్కిన ప్రపంచం ఎదురుచూస్తోంది. కానీ స్వదేశంలోనూ, విదేశాల్లోనూ వచ్చే నాలుగేళ్లలో అమెరికా రాజకీయాలు గత 50 ఏళ్ల కాలంలో ఉన్న స్థాయిని అందుకోవడం కాకుండా ట్రంప్ నాలుగేళ్ల పాలనలోని ఫలితాలనే సాగించేటట్టు కనబడుతోంది. -ఇయాన్ బ్రెమ్మర్, కాలమిస్ట్ -
జాతరను విజయవంతం చేద్దాం
పాపన్నపేట(మెదక్):మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల్లో జరిగే మహాజాతరను అధికారులంతా సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాతరపై ఏడుపాయల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర తెలంగాణలోనే అతిపెద్ద జాతరన్నారు. ఈ ఏడాది మాఘ అమావాస్య పుణ్య స్నానాలకు వెల్లువలా తరలివచ్చిన భక్తజనాలను చూస్తే.. శివరాత్రి జాతరకు సుమారు 10లక్షల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అదే స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లక్షలాది భక్తులు తరలివచ్చే ఏడుపాయల జాతరలో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. ఈసారి మంజీరా నదిలో నీరు లేనందున ఘనపురం ప్రాజెక్ట్ మడుగుల్లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి చెక్‌డ్యాం నింపాలన్నారు. అమ్మవారి ఆలయం ముందు వరకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల స్నానాల కోసం షవర్ బాత్‌ల సంఖ్య పెంచాలన్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు అనువుగా వసతులు కల్పించాలన్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ట్యాంకర్లను వినియోగించాలని ఆదేశించారు. భక్తుల సంఖ్యకనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టి రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు. 750 మంది పంచాయతీ సిబ్బందితో నిరంతరం సేవలు అందించాలని ఆదేశించారు. చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా 24గంటల పారిశుధ్య సేవలు అందించాలన్నారు. మంజీరానదిలో ఎక్కడి పడితే అక్కడ భక్తులు స్నానాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్టాండ్‌ను విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి పోతంశెట్టిపల్లి వైపు నుంచి కూడా జాతరకు వాహనాలను అనుమతిస్తామన్నారు. ఎడ్లబండ్లకు పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయించాలన్నారు. అమ్మవారి ఆలయాన్ని, రాజగోపుర, పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. 24గంటలపాటు నిరంతర విద్యుత్ అందించాలని సూచించారు. వైద్య సౌకర్యాలు 24గంటలు అందుబాటులో ఉండాలన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను జాతరలో ప్రచారం చేయాలని సూచించారు. ఈ పనులన్నీ 25వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తిరిగి 26న సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పుడు పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జాతర నిర్వహణ విఫలమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జాతరకు 1,150 మంది పోలీసులను బందోబస్తుకోసం నియమిస్తున్నట్లు అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు. కాలినడనక కలెక్టర్ ఏడుపాయల్లో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కలెక్టర్, జేసీ నగేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ నాగరాజు, ఆర్డీఓలు ఇతర అధికారులతో కలిసి ఘనపురం ఆనకట్టపై నుంచి కాలినడకన జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం ఏడుపాయల్లోని చెక్‌డ్యాం, అమ్మవారి ఆలయం, ఘనపురం ఆనకట్ట, అంతర్గత రోడ్లు, బస్టాండ్ ప్రదేశం, విద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాలను సందర్శించారు. అక్కడ చేసే ఏర్పాట్లను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు. వారి వెంట ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌శాఖ, ఫారెస్ట్‌శాఖ అధికారులతోపాటు తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకావ్, డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు, పాలకవర్గ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పోలీసులకు తీపి కబురు
గుంటూరు: అర్బన్, రూరల్ జిల్లాల పోలీస్ సిబ్బందికి త్వరలో తీపి కబురు అందనుంది. ఎనిమిదేళ్లుగా నలుగుతున్న పోలీస్ సిబ్బంది విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూరల్ ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు పారదర్శకంగా జాబితాను సిద్ధం విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓ వైపు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేశారు. జాబితాలో పొరపాట్లు, విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనెల 12న సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్వీకరించిన వినతులు, ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చారు. వాటి ఆధారంగా సమస్యలు లేకుండా జాబితాను సవరించే పనిలో ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. నేడో, రేపో తుది జాబితాను రూపొందించి ఉన్నతాధికారుల అనుమతితో విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొం దించారు. కొనసా..గిన విభజన 2010 మేలో గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఎనిమిదేళ్ల నుంచి నలుగురు ఎస్పీలు సిబ్బందిని విభజన చేయాలని యత్నించారు. 2013లో డీజీపీ ఆదేశాల మేరకు అప్పట్లో తుది జాబితాను కూడా రూపొందించి ప్రకటించేలోగా కొందరు సిబ్బంది తమకు సీనియార్టీలో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటి నుంచి సిబ్బంది విభజన ఎస్పీలకు సవాలుగానే మారింది. అనంతరం 2015లో పీహెచ్డీ రామకృష్ణ కూడా విభజన చేసేందుకు యత్నించారు. పూర్తిస్థాయిలో సీనియార్టీలను పరిశీలించి వాస్తవాలకు అనుగుణంగా రూపొందించాలని ఉద్యోగుల్ని ఆదేశించారు. ఈలోగా ఆయన బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి విభజన ప్రక్రియను పూర్తిచేసి దిశగా యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ప్రస్తుత ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు సమస్యను పరిష్కరించి సిబ్బంది, అధికారుల పదోన్నతుల్లో ఆటంకం తొలగించాలనే నిశ్చయంతో ముందుకు వెళుతున్నారు. ఆచితూచి అడుగు జిల్లావ్యాప్తంగా 4500 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వేసవి సెలవుల్లో బదిలీలు జరిగేతే పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చేసుకోవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న ఎస్పీ ఈలోగానే పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విమర్శలు లేకుండా తుది జాబితాను రూపొందించి డీజీపీ అనుమతితో విడుదల చేసేందకు కృషి చేస్తున్నారు. ఐపీఎస్‌ల తరహాలోనే విభజన రాష్ట్రం విడిపోయే సమయంలో ఐపీఎస్‌ల విభజన జరిగిన తరహాలోనే ప్రక్రియ ఉంటుంది. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆరోపణలకు తావు లేకుండా విభజన పూర్తి చేయడమే నా లక్ష్యం. తుది జాబితా వెలువడిన అనంతరం ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లి న్యాయం కోరవచ్చు. త్వరలో జాబితా విడుదల చేస్తాం.– సీహెచ్ వెంకటప్పలనాయుడు, రూరల్ ఎస్పీ -
అగ్నిమాపకశాఖ విభజన పూర్తి
కరీంనగర్ క్రై ం: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అగ్నిమాపక శాఖలో ఇప్పటికే విభజన ప్రక్రిక పూరై ్తనట్లు సమాచారం. కరీంనగర్ కేంద్రంగా జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. విభజన జరుగుతున్న క్రమంలో అగ్నిమాపక శాఖలో మార్పులు లేకుండా ఆయా జిల్లాల్లోని ఫైర్స్టేషన్లు, అక్కడి సిబ్బంది అదేవిధంగా కొనసాగుతారని తెలిసింది. డీఎఫ్‌వో పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ప్రాంతీయ అగ్నిమాపక అధికారిగా మార్చి ఒకే అధికారికి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలు కూడా పంపారని, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిసింది. జిల్లాలోని ఫైర్ స్టేషన్లు: జగిత్యాల : జగిత్యాల, మెట్పల్లి (ధర్మపురి, రాయికల్ ఔట్సోర్సింగ్) పెద్దపల్లి : పెద్దపల్లి, మంథని, గోదావరిఖని కరీంనగర్ : కరీంనగర్, సిరిసిల్ల. -
గిరి చెదిరే..!
ఆరు గిరిజన మండలాలపై ఆందోళన ఖమ్మంలో కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు మహబూబాబాద్ జిల్లాలోకి గార్ల, బయ్యారం కొత్తగూడెంలో కొనసాగించాలని ఆందోళనలు ఇల్లెందు: జిల్లాల విభజనలో గిరిజన ప్రాంతం మూడు ముక్కలవుతోంది. కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తుండగా.. గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్తున్నాయి. ఈ ఆరు మండలాలను కొత్తగూడెం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ, గిరిజన, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి. జల్, జంగిల్, జమీన్ హమారా.. కొమురం భీం నినాదంతో ఒక్కటైన అటవీ ప్రాంతాలు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మరోమారు ఉద్యమపథంలో పయనిస్తున్నాయి. నాటి ఉద్యమాల ఫలితంగా 1/70 చట్టం, పెసా, సమత జడ్జిమెంట్, అటవీహక్కు చట్టం, జీఓ నంబర్ 3, ఐటీడీఏల ఏర్పాటు వంటి ఎన్నో ప్రయోజనాలు పొందామని గిరిజనులు పేర్కొంటున్నారు. వీటన్నింటినీ గిరిజనులు యథాతథంగా పొందాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఆరు మండలాలను కూడా కొత్తగూడెం జిల్లాలో చేర్చాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గిరిజన ప్రాంతం ఛిన్నాభిన్నం జిల్లాల పునర్విభజనతో గిరిజన ప్రాంతం ఛిన్నాభిన్నం అవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా రాష్ట్ర విభజనతో ఐదు మండలాలు పూర్తిగా రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రాలో కలిపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 41 మండలాలు ఉండగా ఇందులో 24 మండలాలు గిరిజన ఉప ప్రణాళిక (ఎస్టీ సబ్ ప్లాన్) పరిధిలో ఉన్నాయి. జిల్లాల విభజనలో గిరిజన మండలాలను మూడు ముక్కలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలోకి కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాలు వెళ్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో గార్ల, బయ్యారం మండలాలను విలీనం చేస్తున్నారు. ఈ ఆరు మండలాలను సైతం కొత్తగూడెం జిల్లాలో విలీనం చేసి, గిరిజన జిల్లాగా ప్రకటించాలని ఆదివాసీ, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభివృద్ధిపై ఆందోళన ఏజెన్సీ మండలాలను విభజించి మైదాన ప్రాంతంలో కలపడం వల్ల ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి వస్తున్న గిరిజనులు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 23,88,575 మంది జనాభా ఉండగా ఇందులో 6,46,791 మంది గిరిజనులు ఉన్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 2,16,631 మంది ఉండగా, మహబూబాబాద్‌లో ( గార్ల–బయ్యారం) 40,436 మంది, కొత్తగూడెంలో 3,89,724 మంది ఉన్నారు. కామేపల్లి మండలంలో 41,955 మంది ఉండగా 166 చ.కి.మీ వైశాల్యం ఉంది. కారేపల్లి మండలంలో 54,897 జనాభా ఉండగా, 253 చ.కి.మీ వైశాల్యం, జూలూరుపాడులో 33,395 మంది జనాభా 240 చ.కి.మీ వైశాల్యం, ఏన్కూరులో 35,342 జనాభా ఉండగా 233 చ.కి. మీ వైశాల్యం ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో విలీనం అవుతున్న గార్ల–బయ్యారం మండలాల్లో సుమారు 80 వేల జనాభా ఉండగా 250 చ.కి. మీ వైశాల్యం ఉన్నాయి. ఈ మండలాలను విభజించి రెండు జిల్లాల్లో కలుపటం వల్ల గిరిజనులు విద్య,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. సాగుతున్న ఆందోళనలు ఇల్లెందును జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రం చేయాలని న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బహుజన సమాజ్‌పార్టీ, చండ్ర పుల్లారెడ్డి వర్గం, గిరిజన సంఘాలు జిల్లా, డివిజన్ సాధన కమిటీగా ఏర్పడి సుమారు 30 రోజుల పాటు ఆందోళనలు, రిలే దీక్షలు నిర్వహించిన విషయం విదితమే. డివిజన్ కేంద్రం చేయాలని సీపీఐ, న్యూమోక్రసీ రాయల వర్గం ఆందోళన నిర్వహించాయి. గిరిజన మండలాలను విభజించరాదంటూ నంగారాభేరి, సేవాలాల్ సేన, తుడుందెబ్బ, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్(ఏటీఎఫ్), టీటీఎఫ్, టీటీటీఎఫ్, ఏటీఏ లాంటి సంఘాలు ఆంధోళనకు దిగాయి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏకంగా హైకోర్టును ఆశ్రయింది. గిరిజన ప్రాంతాన్ని ముక్కలు చేయొద్దు: కబ్బాకుల రవి, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గిరిజన ప్రాంతాన్ని మూడు ముక్కలు చేయాలనే ప్రతిపాదనను విరిమించుకోవాలి. ఇల్లెందు మండలాన్ని కూడా మహబూబాబాద్‌లో కలుపుకోవాలనే ప్రయత్నం తగదు. షెడ్యూల్ ప్రాంతాలను, నాన్ షెడ్యూల్ ప్రాంతాలను కలిపి జిల్లాలు చేయొద్దు. కొత్తగూడెంలోనే ఈ ఆరు మండలాలను కొనసాగించాలి. షెడ్యూల్ నాన్ షెడ్యూల్ ప్రాంతాలను కలపొద్దు: ఈసం నర్సింహారావు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు షెడ్యూల్ ప్రాంతాలు, నాన్ షెడ్యూల్ ప్రాంతాలను కలిపి జిల్లాలు చేయవద్దు. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో అనేక చట్టాల ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకునే వారు లేరు. గిరిజనులను విభజించటం వల్ల చట్టాలు అమలుకు నోచుకోకుండా పోతాయి. ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయాలి. ఆ ఆరింటిని కొత్తగూడెం జిల్లాలో ఉంచాలి : అజ్మీరా శివనాయక్, నంగారాభేరి ఖమ్మం జిల్లాలో విలీనం చేస్తున్న కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, మహబూబాబాద్ జిల్లాలో విలీనం చేస్తున్న గార్ల, బయ్యారం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కొనసాగించాలి. ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను విడదీయటం వల్ల గిరిజనులు అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. గిరిజనులను అంతం చేసేందుకే జిల్లాల విభజన: పూనెం శ్రీనివాస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు గిరిజనులను అంతం చేసేందుకే ప్రభుత్వం జిల్లాలు విభజన చేస్తోంది. తెలంగాణ జిల్లాల విభజన చట్టం–1974 వల్ల ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసం జిల్లాల విభజనను తెచ్చింది. దీనిపై ఏఎస్పీ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించాం. ఆరు మండలాలను కొత్తగూడెంలోనే ఉంచాలి : అజ్మీర కిషన్ నాయక్, టీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ మండలాలను మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయించటం తగదు. గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలి. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం. -
ఖమ్మం ‘కట్’!
రెండుగా చీలుతున్న జిల్లా 63 ఏళ్ల క్రితం ఆవిర్భావం కలెక్టరేట్‌కు 1959లో భూమిపూజ పాలనా కేంద్రానికి 57 ఏళ్లు పూర్తి 47 మంది కలెక్టర్లు.. 34 మంది జేసీలు జిల్లాకు తొలి కలెక్టర్ భట్.. చివరి కలెక్టర్ లోకేశ్ ఎంతో చరిత్ర కలిగిన ఖమ్మం జిల్లా ఆవిర్భవించి 63 ఏళ్లు. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ జిల్లా కలెక్టరేట్‌కు 1959లో భూమిపూజ జరిగింది. ఉద్యమాల ఖిల్లాగా పేరెన్నికగన్న జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం త్వరలో రెండుగా చీల్చనున్నారు. ప్రస్తుతం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లా ఆవిర్భవించనుంది. ఇప్పటి వరకు 47 మంది కలెక్టర్లు, 34 మంది జేసీలు జిల్లాలో విధులు నిర్వహించారు. ఖమ్మం జెడ్పీసెంటర్: స్వాతంత్య్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఎంతో చరిత్ర కలిగిన ఖమ్మం జిల్లా 63 ఏళ్ల తర్వాత రెండు ముక్కలు కాబోతుంది. ఉమ్మడిగా ఉన్న జిల్లాను విభజిస్తూ కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. 1953 అక్టోబర్ 1న జిల్లా ఆవిర్భవించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 193 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా అపార ఖనిజ నిక్షేపాలు, భిన్న సంస్కృతులకు నిలయంగా ఉంది. పునర్విభజనతో జిల్లా పూర్వ వైభవాన్ని కోల్పోనుంది. జిల్లాలో 47 మంది కలెక్టర్లు, 34 మంది జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా చరిత్ర 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పడిన తరువాత 1959 జనవరి 8న అప్పటి గవర్నర్ భీమ్సేన్సచార్ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లా తొలి కలెక్టర్‌గా జీవీ భట్ పనిచేశారు. తొలుత కలెక్టర్ కార్యాలయం ప్రస్తుత మున్సిపల్ కార్యాలయంలో ఉండేది. తరువాత వైరా రోడ్డు ప్రధాన రహదారి పక్కకు మార్చారు. ప్రస్తుతం ఉన్న ఖమ్మం పేరు నరసింహాద్రి గుడి నుంచి వచ్చింది. నారసింహస్వామి ఆలయం ‘స్తంభ శిఖరి’ రాతి గుట్టపై ఉంది. రాతి శిఖరం కింద ఉన్న ఈ గుడిని ‘కంభ’ అనే పేరుతో పిలిచేవారు. కంభ అంటే స్తంభం అని అర్థం. ఖమ్మం అనే పేరు ‘కంభం మెట్టు’ నుంచి ‘ఖమ్మం మెట్టు’గా.. ప్రస్తుతం ఖమ్మంగా రూపాంతరం చెందింది. ఖమ్మం పట్టణం మున్నేరు పక్కనే ఉంది. మున్నేరు కృష్ణాకు ఉప నది. ఆవిర్భావం ఇలా.. 1953 అక్టోబర్ 18న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ తాలుకాలతో జిల్లాను ఏర్పాటు చేస్తూ 48/ఏవై/193/53 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. 1953 అక్టోబర్ 1కి పూర్వం ఖమ్మం జిల్లా ఏర్పడక ముందు వరంగల్ తాలూకాలో భాగంగా ఉండేది. వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం (అప్పట్లో ఖమ్మం మెట్టు), మధిర, పాల్వంచ, ఇల్లెందు, బూర్గంపాడు తాలూకాలను విడదీసి 1953 అక్టోబర్ 1న ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1959లో తూర్పు గోదావరి జిల్లాలోని భద్రాచలం, నూగూరు వెంకటాపురం తాలూకాలను కూడా ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు. అశ్వారావుపేట ప్రాంతాన్ని కూడా అదే ఏడాది జిల్లాలో కలిపారు. 1973లో మధిర, కొత్తగూడెం (అంతకు ముందు పాల్వంచ) తాలూకాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి సత్తుపల్లి తాలూకాను ఏర్పాటు చేశారు. 1979లో ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం, బూర్గంపాడు తాలూకాల్లోని పలు ప్రాంతాలను విడదీసి తిరుమలాయపాలెం, సుదిమళ్ల, అశ్వారావుపేట, మణుగూరు తాలూకాలను ఏర్పాటు చేశారు. 1985లో తాలూకా వ్యవస్థ రదై్ధ మండలాల వ్యవస్థ ప్రారంభమయ్యాక జిల్లాను 46 మండలాలుగా విభజించారు. ప్రస్తుతం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో పాల్వంచ రెవెన్యూ డివిజన్ కనుమరుగు కానుంది. కొత్తగా వైరా రెవెన్యూ డివిజన్ ఆవిర్భవించనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాలోని 5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయి. 41 మండలాలు జిల్లాలో ఉన్నాయి. పునర్విభజనతో జిల్లా రెండుగా చీలనుంది. జిల్లా కలెక్టర్లు వీరే.. జిల్లా కలెక్టర్లుగా ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్‌లు పని చేశారు. జిల్లా తొలి కలెక్టర్‌గా జివి భట్ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కలెక్టర్‌గా ఐ.శ్రీనివాసశ్రీనరేశ్ పని చేశారు. 47వ కలెక్టర్‌గా డీఎస్ లోకేష్‌కుమార్ పని చేస్తున్నారు. జిల్లా తొలి జాయింట్ కలెక్టర్‌గా 1985 నవంబర్1 లక్ష్మీపార్ధసారథి భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో సురేంద్రమోహన్ జేసీగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో చివరి జేసీగా దేవరాజన్ దివ్య పని చేస్తున్నారు. చరిత్రలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా పనిచేశారు. వారిలో లక్ష్మీపార్ధసారథి భాస్కర్, ఉషారాణి ఉన్నారు. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సంఖ్య పేరు సంవత్సరం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 1. జీవీ భట్ 01–11–1953–25–10–1956 2. ఎంఏ హమీద్ 26–10–1956– 10–04–1957 3. ఆర్ఎస్ ప్రకాశ్‌రావు 11–04–1957– 01–05–1957 4. జేఏ ధర్మరాజు 02–05–1957– 28–07–1958 5. పీసీ జేమ్స్ 29–07–1958– 08–05–1959 6. సయ్యద్హసిమ్అలీ 18–05–1959– 23–05–1960 7. బీఎన్ జయసింహ 09–06–1960– 02–05–1961 8. కేవీ నటరాజన్ 03–05–1961– 09–11–1961 9. వి.శ్రీనివాసచారి 10–11–1961– 25–04–1962 10, ఎం.అసదుల్లాసయ్యద్ 26–04–1962– 21–09–1964 11. పీఎస్కృష్ణ 21–09–1964– 10–05–1967 12. అంజద్‌అలీఖాన్ 28–06–1967– 21–09–1968 13. ప్రేమ్రాజ్మతుర్ 02–12–1968– 07–06–1971 14. ఆర్.పార్ధసారథి 07–06–1971– 23–07–1972 15. గులాంజిలానీ 24–07–1972– 17–12–1973 16. ఆర్.పార్ధసారథి 19–12–1973– 14–09–1974 17. పీవీఆర్కే ప్రసాద్ 18–09–1974– 19–05–1977 18. ఎస్.బెనర్జి 20–05–1977– 27–01–1979 19. డి.సుబ్బారావు 12–02–1979– 09–11–1979 20. కె.లక్ష్మీనారాయణ 10–11–1979– 15–09–1980 21. సి.వెంకటేశ్వరరావు 16–09–1980– 02–11–1981 22. వి.వేణుగోపాలరావు 21–12–1981– 08–08–1982 23. పీకే రస్తోగి 09–08–1982– 26–03–1985 24. ఆర్‌హెచ్.క్వాజా 27–03–1985– 28–04–1987 25. ఐ.వైఆర్.కృష్ణారావు 29–04–1987– 19–04–1989 26. వి.శర్మరావు 23–04–1989, 17–01–1990 27. ఎస్కె.సిన్హా 18–01–1990– 06–01–1991 28. పి.సుబ్రమణ్యం 07–01–1991– 31–03–1991 29. లక్ష్మీపార్ధసారథి భాస్కర్ 06–04–1991– 27–08–1993 30. ఏపీ సహనీ 28–08–1993– 22–04–1995 31. ఎన్.నర్సింహారావు 24–04–1995–04–12–1996 32. నీరబ్‌కుమార్ ప్రసాద్ 05–12–1996–21–04–1998 33. ఎండీ అలీరఫత్ 22–04–1998–19–06–1998 34. ఏ.గిరిధర్ 20–06–1998–11–07–2002 35. అరవింద్‌కుమార్ 13–07–2002- 20–09–2004 36. రాజేంద్రనరేంద్ర నిమ్జే 20–09–2004–17–05–2006 37. సాల్మన్‌ఆరోఖ్యరాజ్ 18–05–2006– 19–05–2006 38. శశిభూషణ్‌కుమార్ 20–05–2006– 12–02–2009 39. వి.ఉషారాణి 14–02–2009–05–04–2010 40. ఎన్.నాగేశ్వరరావు 08–04–2010–31–03–2011 41. మహ్మద్‌అబ్దుల్ అజీం 01–04–2011–08–04–2011 42. సిద్దార్థజైన్ 09–04–2011– 23–06–2013 43. ఐ.శ్రీనరేష్ 24–06–2013– 31–07–2014 44. కె.ఇలంబరితి 01–08–2014– 31–08–2015 45. డీఎస్ లోకేష్‌కుమార్ 31–08–2015– 27–04–2016 46. ఎం.దానకిశోర్ 27–04–2016– 22–05–2016 47. డీఎస్ లోకేష్‌కుమార్ 23–05–2016 -
ట్రంప్ కు తప్పని ఇంటిపోరు
వాషింగ్ టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీనుంచే భారీ ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరపున నామినేషన్‌ను ఖరారు చేసుకున్న ట్రంప్ కు మద్దతు ఇవ్వబోమని పార్టీలోని టాప్ సెక్షన్ బహిరంగంగానే ప్రకటించింది. ఈ మేరకు పార్టీలో రెండు వర్గాలుగా శనివారం చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతూ అధ్యక్ష పీఠానికి చేరువవుతున్న వివాదాస్పద రియల్టర్, బిలియనీర్ డోనాల్డ్ .ట్రంప్ కు చెక్ పెట్టేందుకు రిపబ్లికన్ పార్టీ పెద్దలు సిద్దమవుతున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆయనకు మద్దతిచ్చేది లేదని తేల్చి చెబుతన్నారు. ట్రంప్ నామినేషన్ వ్యవహారంలో పార్టీ పెద్దల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ట్రంప్ కు ఇంటిపోరు తప్పేలా కనిపించడం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుల సోదరుడైన ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్, సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంకు జతకలిశాడు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్ కూడా మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పి ట్రంప్ కి ఝలక్ ఇచ్చాడు ట్రంప్ సరైన అభ్యర్తినని తాను నమ్మడం లేదంటూ ఫేస్ బుక్ లో బహిరంగ ప్రకటన చేశాడు. పార్టీకూడా ట్రంప్ ను సుప్రీంగా ఎన్నుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ లోజరిగే ఎన్నికల్లో తాను క్లింటన్ కుగానీ ట్రంప్ కు కానీ ఓటు వేయడం లేదన్నారు. అమెరికన్ అధ్యక్ష కార్యాలయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, అధ్యక్షుడికి సవాళ్లను స్వీకరించే ధైర్యం, వినయం, మానవత్వం లాంటి లక్షణాలుండాలని, అలాంటివేవీ ట్రంప్ లో లేవని, అసలు అతను స్థిరమైన పార్టీ సభ్యుడుకాదని మిస్టర్ జెబ్ విమర్శించాడు. అటు క్లైవ్ లాండ్ కన్ వెన్షన్ కు తాను హాజరు కావడంలేదని జాన్ మెక్ కెయిన్ ప్రకటించాడు. మరోవైపు టెక్సాస్ గవర్నర్ రిక్ పెర్రీ, 1996 అధ్యక్ష ఎన్నికల నామినీ, బాబ్ డోలే ట్రంప్ కు గట్టి మద్దతునందిస్తున్నారు. ప్రజలు ట్రంప్ ను ప్రజలు గౌరవించి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అలాంటి ప్రజల తీర్పును గౌరవించాలని ట్రంప్ కు మేజర్ సపోర్ట్ నిస్తున్న బోలే వాదించాడు. జూలై జరిగే క్లీవ్ లాండ్ కన్వెన్షన్ కు హాజరై, ట్రంప్ కు మద్దతుగా ఓటు వేస్తానని స్పష్టం చేశాడు. అయితే జెబ్, గ్రాహం ఆరోపణలను ట్రంప్ కొట్టి పారేశారు. ఓటర్లను వారిని తిరస్కరించడంతో తనపై దాడికి దిగారని విమర్శించారు. హిల్లరీకి ఓడించడానికి పార్టీని ఏకం చేసే సమర్థతకు తనకు ఉందని స్పష్టం చేశాడు. కాగా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.... తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నప్పటికీ కీలకమైన ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లోనూ ఘన విజయంతో తన గట్టి పోటీదారుడైన టెడ్క్రుజ్ను మట్టికరిపించాడు. ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో గెలుపుతో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిని తానేనని నిరూపించుకున్న ట్రంప్.... జూన్ 7న నామినేషన్ వేయనున్నారు. అలాగే అమెరికా అధ్యక్ష పదవికి అసలైన ఎన్నికలు నవంబర్ 8న జరగనున్నాయి. -
ఏపీ భవన్ విభజన వేగవంతం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పనులు వేగంగా సాగుతున్నాయి. గదులు, సామగ్రి లెక్కింపును అధికారులు పూర్తిచేశారు. వీటిలో వేటిని తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలన్న దానిపై కసరత్తు ప్రారంభించారు. మరో వారంలో విభజన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. గోదావరి, శబరి, స్వర్ణముఖి బ్లాక్‌లలోని గదులను ఇరు రాష్ట్రాలకు సమానంగా పంచనున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కాటేజి ఒకటి ఉంది. దీనిని ఒక రాష్ట్ర సీఎంకు కేటాయించాలని, మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి శబరి బ్లాక్‌లోనే కాటేజి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక ఏపీ భవన్ ఉద్యోగులు, వారి స్థాయి, సర్వీసు కాలం తదితర వివరాలతో పూర్తి నివేదికలను ప్రభుత్వానికి పంపారు. ఇక్కడ ఉన్న 90 మంది ఉద్యోగులను 42 : 58 నిష్పత్తితో విభజించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనిప్రకారం తెలంగాణకు 38 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 52 మంది ఉద్యోగులు ఉండవచ్చని సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో తెలంగాణకు చెందిన వారు 10 మందే ఉన్నారు. మరో 28 మందిని ఏ ప్రాతిపదికన తెలంగాణకు కేటాయిస్తారన్నది ఇంకా తేలలేదు. దీనిపై ఉన్నత స్థాయిలోనే నిర్ణయిస్తారని, అది తేలాకే ఉద్యోగుల విభజన ఉంటుందని ఇక్కడి అధికారులు తెలిపారు. -
రాష్ట్ర బడ్జెట్‌ను 2 రాష్ట్రాలకు విభజించండి
అన్ని శాఖలకు ఆర్థికశాఖ సర్క్యులర్ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను.. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రెండు రాష్ట్రాలకు విభజించాల్సిందిగా ఆర్థికశాఖ బుధవారం అన్ని శాఖలు, విభాగాల అధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ప్రత్యేకంగా సర్క్యులర్ జారీచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 1,83,129 కోట్లుగా ఆర్థికశాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపధ్యంలో ఇందులో తొలి ఆరు నెలల వ్యయానికి మాత్రమే అసెంబ్లీ నుంచి ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెలల్లో బడ్జెట్ కేటాయింపులో ఆరో వంతు అంటే.. రూ. 30,521 కోట్లు మాత్రమే ఆయా శాఖలు వ్యయం చేసేందుకు ఆర్థికశాఖ అనుమతించింది. ఏ శాఖ ఎంత వ్యయం చేయాలనే విషయాన్ని కూడా ఆర్థికశాఖ స్పష్టం చేయనుంది. బడ్జెట్లో పథకాలు, కార్యక్రమాల అమలు, జీతభత్యాలు, పెన్షన్లతో పాటు అన్ని రంగాలకు కేటాయించిన నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఎంత, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో తెలియజేస్తూ ఈ నెల 15వ తేదీలోగా ఆర్థికశాఖ వెబ్సైట్లో ఆన్లైన్లో నమోదు చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధిని కూడా రెండు రాష్ట్రాలకు విభజించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం బుధవారం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్‌కు లేఖ రాశారు. -
విభజన’ ఎమర్జెన్సీని తలపిస్తుంది.
విభజన’ ఎమర్జెన్సీని తలపిస్తుంది. గూడూరు, దేశ చరిత్రలో రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ఆమోదించిన రోజు చీకటి రోజని.. ఎమర్జెన్సీని తలపించేలా లోక్‌సభలోకి మీడియాకు కూడా ప్రవేశం లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టవర్‌క్లాక్ సెంటర్ నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరి ముత్యాలపేట మీదుగా రైల్వే స్టేషన్, రాజావీధి మీదుగా గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి సంగం థియేటర్ మీదుగా తిరిగి టవర్‌క్లాక్ సెంటర్‌కు ర్యాలీ చేరింది. అక్కడ రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బంద్‌కు మద్దతుగా పట్టణంలోని దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. ఈ సందర్భంగా ఎల్లసిరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజల మనోభిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా రాక్షసత్వంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని, ఈ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో సమైక్య పోరు చేపట్టారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక బలీయమైన శక్తిగా మారుతుండటంతో అది తట్టుకోలేక ఏ విధంగానైనా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే పాలక, ప్రతిపక్షాలు ఒక్కటై దుశ్చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్రెడ్డేనని, చంద్రబాబు, కిరణ్‌లు రెండు కళ్ల సిద్ధాంతాలు పాటిస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు సీమాంధ్ర ప్రజలు ఓట్లతో గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నాశిన నాగులు, రాజేశ్వరరెడ్డి, ఎల్లా శ్రీనివాసులురెడ్డి, రాజశేఖరరెడ్డి, శివకుమార్, మధురెడ్డి, సత్యం, లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్లు గురవయ్య, బొమ్మిడి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, పెల్లేటి శ్రీనివాసులురెడ్డి, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, కిరణ్, రంగారెడ్డి, గిరి, బుజ్జయ్యనాయుడు, షణ్ముగం, సరస్వతమ్మ, నవీన్ జయకుమార్, సునీల్, మల్లిగౌడ్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో మోటారుబైక్ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూయించారు. ఈ కార్యక్రమంలో బల్లి కల్యాణ్, శీలం కిరణ్‌కుమార్, బిల్లు చెంచురామయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. వాకాడులో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వాకాడులో పార్టీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంక్‌లను మూయించి సమైక్య నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంటి వెంకటసుబ్బారెడ్డి, పెళ్లూరు కోటిరెడ్డి, పూనమల్లి బాలకృష్ణయ్య, నజీర్‌బాషా, ఎస్కే కాలేషా, కడూరు భాస్కర్, తీపలపూడి చెంగయ్య, రావిగుంటపాళెం రమేష్, సుబ్బయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని దారుణంగా విభజించారు
సాక్షి, అనంతపురం : ‘రాష్ట్రాన్ని దారుణంగా విభజించారు. ఈ పాపం ఊరకే పోదు. విభజించిన కాంగ్రెస్‌ను, అందుకు సహకరించిన టీడీపీని భూస్థాపితం చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీల నేతలకు డిపాజిట్లు కూడా దక్కవు’ అంటూ సమైక్యవాదులు నిప్పులు చెరిగారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యవాదులు చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జన సందడితో కళకళలాడే నగరం, పట్టణాలు వెలవెలబోయాయి. హైదరాబాద్-బెంగళూరు, అనంతపురం-చెన్నై జాతీయ రహదారుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన జరగడం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లింద ని, అందుకు కారణమైన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, స్పీకర్ మీరా కుమార్, బీజేపీ జాతీయ నాయకురాలు సుస్మాస్వరాజ్ దిష్టి బొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. అనంతపురం నగరంలో వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకే పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. -
విభజన డ్రామాలో కిరణ్ ఒక ఎపిసోడ్
నంద్యాల, : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా రాష్ట్ర విభజన కోసం సోనియాగాంధీ ఆడించిన డ్రామాలో ఒక ఎపిసోడ్ అని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. విభజన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రిగా కిరణ్‌ను కొనసాగించడం ద్వారా అధిష్టానం లక్ష్యం నెరవేర్చుకుందన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో నాటకాన్ని ఆయన రక్తి కట్టించారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నేత మోడీ సీమాంధ్రకు మద్దతు ప్రకటిస్తుండగా.. సుష్మాస్వరాజ్, అరున్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తెలంగాణకు మద్దతిస్తూ ద్వంద్వ నీతిని అవలంబించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే విభజన చేస్తామని లోక్‌సభలో బిల్లును బీజేపీ వ్యతిరేకించి ఉంటే ఆ పార్టీ విలువ రెట్టింపయ్యేదన్నారు. చంద్రబాబు సమైక్య లేఖ ఇవ్వకుండా సీమాంధ్రను మోసగించారన్నారు. బీజేపీతో బాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా విభజనకు మార్గం సుగమమం చేసిందన్నారు. ఇన్నివిధాల ద్రోహం చేసిన బాబుకు సీమాంధ్రలో పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు. కాంగ్రెస్ డెరైక్షన్‌లో కిరణ్ సమైక్యవాదిగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూనే విభజనకు సహకరించారన్నారు. మీడియాలో ప్రకటనలు తప్పిస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఆయన చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరు సాగించారని.. విభజన వాదుల దిమ్మతిరిగే సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన కోరారు. -
తెలంగాణ ఏర్పాటుతోనే సమస్యలు పరిష్కారం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పడిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులంతా పర్మినెంట్ అవుతారని టీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొండా బాలకృష్ణారెడ్డి గార్డెన్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తగిన వేతనాలు లేక కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ఏర్పాటైన వెంటనే వారిని పర్మినెంట్ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వివరించామన్నారు. ఇవన్ని జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని, ఆ దిశగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ నిధులన్నీ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తీసుకుపోవడంతో వైద్య, ఆరోగ్యశాఖలో నిధులలేమి ఏర్పడి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షబీర్ అహ్మద్ మాట్లాడుతూ.. సీమాంధ్రులు చేసే కృత్రిమ ఉద్యమాలకు భయపడేది లేదన్నారు. తెలంగాణలో పనిచేస్తూ సీమాంధ్రకు మద్దతుఇచ్చే వారిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర కార్యదర్శి సాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వసతులు లేక మహిళాసిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. సీమాంధ్రుల దోపిడీకి గురవుతున్న శాఖల్లో వైద్య ఆరోగ్యశాఖ ఒకటన్నారు. తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎం.రవీందర్, ఉపాధ్యక్షుడి బి.జంగయ్యను ఎన్నుకున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన గోపాల్‌రెడ్డి పదోన్నతిపై మెదక్ జిల్లాకు బదిలీ కావడంతో నూతనంగా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌రావు, నాయకులు ఎస్.రవీందర్, శివశంకర్, సతీష్‌గౌడ్, నవీన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు రామస్వామి, వేమారెడ్డి, కృష్ణయ్య, రాంచంద్రారావు, టీఎస్‌జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని విభజిస్తే ఆర్టీసీ మూతే
పొదిలి, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజిస్తే ఆర్టీసీ సంస్థను మూసేయాల్సి వస్తుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక డిపో ఆవరణలో నిర్వహించిన ఉద్యోగ జేఏసీ సమావేశంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఐకమత్యంగా సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెలో పాల్గొని సమ్మెకు బలం చేకూర్చాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో ఉందని, దానికి కారణం వారికి ఆర్టీసీ తప్ప వేరే రవాణా మార్గాలు లేవన్నారు. ఆంధ్రా, రాయలసీమల్లో ఒక్క కర్నూలు తప్ప మిగతా 12 జిల్లాలు రాజధానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ జిల్లాల్లో 4 వేల ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. రాయలసీమ ఎడారిగా మారి వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన రహంతుల్లా, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కోసం తమకు ఆర్థిక నష్టం జరిగినా సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు నారు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులంతా ఐకమత్యంగా సమ్మెలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా బలం చేకూర్చాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య, మాల్యాద్రిరెడ్డి, గౌష్, జగన్మోహన్రెడ్డి, హజరత్, నాగూర్, బసవారెడ్డి,నాగేశ్వరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.