నిర్ణయం గట్టిగానే తీసుకుంటారు. అమలు బాధ్యతే ఎవరిదో తెలీదు. అందుకే అవి ఆచరణలో విఫలమవుతుంటాయి. ఇదీ మన జిల్లా యంత్రాంగం తీరు. సాక్షాత్తూ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఐఏబీ సమావేశంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అది వాస్తవ రూపం దాల్చక పోవడంతో రైతులు తమకు తోచినట్లుగా ‘జూరాల’ పరిధిలో జోరుగా వరిసాగు చేపట్టారు. దానికి పంట సమయానికి నీళ్లే ప్రశ్నార్థకమన్నది వారికి తెలియదు. ఏటా ఈ అనుభవం ఉన్నా ఎవరూ పట్టించుకోరు. జస్ట్ చూస్తుంటారంతే.
గద్వాల, న్యూస్‌లైన్ : సమావేశాల్లో జరగబోయే పరిస్థితులను అంచనా వేస్తారు. తీర్మానం చేస్తారు. ఆ తర్వాతే ఎవరికి వా రు పట్టించుకోరు. ఇదే మళ్లీ రిపీట్. జూ రాల ప్రాజెక్టు పరిధిలో రబీ సీజన్ పంట ల సాగు కేవలం ఆరుతడి పంటలే ఉం డే లా చూడాలని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జ రిగిన ఐఏబీ సమావేశంలో ప్రజా ప్రతి ని ధులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అ ధికారులు సమష్టి నిర్ణయం తీసుకున్నా రు. ఆయకట్టు పరిధిలో రైతులను చైతన్య పర్చి ఆరుతడి పంటలు సాగు చేసుకునే లా చొరవ చూపుతున్న అధికారి ఒక్కరూ కనిపించడం లేదు. దీంతో నీళ్లొస్తాయన్న నమ్మకంతో ఆయకట్టులో ఉన్న రైతులు ఎప్పటిలాగానే వరి సాగు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంటే వరిసాగు జరుగుతున్నా ఏ అధికా రి పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వె ళ్తే... గత రెండేళ్లుగా జూరాల ప్రాజెక్టు ప రిధిలోని రబీ పంటకు చివరి సమయం లో కర్ణాటక నుంచి నీళ్లు రాకపోవడం, వా రబంది పద్దతిని పాటించడం, రైతులు పె ద్ద ఎత్తున నష్టపోవడం రివాజైంది.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ ఏడవ తేదిన జిల్లా కలెక్టర్ అ ధ్యక్షతన ఐఏబీ సమావేశంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని జూరాల పరిధి లో 50వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేసుకోవడానికి నీటిని అందించాల ని నిర్ణయించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి అరుణ, ప్రజా ప్ర తినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నా రు. ఇంత మంది పాల్గొన్న ఈ సమావేశంలోనూ గత రెండేళ్లలో జరిగిన రబీ సీజన్ సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. గతంలో జరిగిన రబీ పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి వరి సాగు చేయకుండా రైతుల్లో మార్పు తీసుకురావాలని గట్టిగానే అనుకున్నారు.
ఆ సమావేశం ముగిశాక రైతులలో మార్పు తెచ్చే ఆలోచన చేయకపోగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దీంతో జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని ధరూరు, గద్వాల, ఇటిక్యాల, ఆత్మకూరు, పెబ్బేరు మండలాల పరిధిలోని 50వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రధాన రహదార్ల పక్కన కూడా జూరాల ఆయకట్టు రైతులు ముమ్మరంగా వరి నారుమళ్లు చేస్తున్నా, ఆరుతడి పంటలకు మాత్రమే నీళ్లిస్తామని, వరిని సాగు చేసుకోవద్దని ఏ అధికారి కూడా ప్రకటన కూడా చేయకుండా వదిలేస్తున్నారు. వరి పంటలు సాగు చేసుకున్న రైతులకు చివరి సమయంలో మార్చి, ఏప్రిల్ నెలలో నీళ్లందకపోతే గత రెండేళ్లలో జరిగిన నష్టాన్ని మరోసారి అమాయక రైతులు చవిచూడక తప్పదు.
గ్రామాల్లో టాం టాం వేయిస్తాం
ఆర్డీఓ నారాయణరెడ్డి.
గ్రామాల్లో రైతులు వరి సాగు చేయకుం డా ఆరతడి పంటలు సాగు చేసుకోవాల ని టాం టాం వేయిస్తామని ఆర్డీఓ నారాయణరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపా రు. ఇ ప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు రైతులను చైతన్య పర్చారని, అయినప్పటికీ వరిసాగు చేసుకుంటున్న విషయం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. కావు న గ్రామాలలో మరోసారి టాం టాం వేయిస్తామని ఆర్డీఓ నారాయణరెడ్డి వివరించారు.
ప్చ్.. గాలికొదిలేశారు
Published Thu, Jan 16 2014 4:58 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement