విశాఖట్నం: విశాఖలో ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ ఎల్‌బీహెచ్ దేవి తెలిపారు. గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళల్లో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం నగరంలోని రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ మహిళల గొంతునుంచి స్రావాలను సేకరించి పరీక్షలకు పంపగా వారికి స్వైన్‌ఫ్లూ నిర్థారణ అయినట్లు శనివారం సాయంత్రం నివేదిక అందింది.
అదే విధంగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. అతన్ని నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ నగరంలో 37 మందికి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్థారణ కాగా అందులో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ముగ్గురికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణతో బాధితుల సంఖ్య 40కి చేరుకుంది.
విశాఖలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ
Published Sat, Sep 5 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement